మహేష్ క్రేజ్ కు ఇదే నిదర్శనం

ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఎన్ని వ్యూస్ కొట్టామన్నదే లెక్క అని అనుకునే డిజిటల్ మీడియా రోజులు ఇవి. ‘శ్రీమంతుడు’తో తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో కలిసి మరోసారి ‘భరత్ అనే నేను’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తిరుగులేని విజయం అందుకున్నడు సూపర్ స్టార్.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, టాలివుడ్ సినిమాల మార్కెట్ పరిధిని తెలుగు రాష్ట్రాల బోర్డర్ అవతల కూడా నిలబెట్టిన మొట్ట మొదటి తెలుగు హీరో. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్నాటక, ఓరిస్సాలో తన ఫ్యాన్ బేస్ పటిష్టం చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. నార్తిండియా మార్కెట్లో లో మన సౌత్ నుండి ప్రప్రధమంగా తెలిసిన హీరో మహేష్.

యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మేడియా లో సూపర్ స్టార్ ఫాలోయింగ్ అంత ఇంతా కాదు. ఇప్పుడు మహేష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు. భరత్ అనే నేను గురించి అనుకుంటున్నారా? లేదండి, శ్రీమంతుడు సినిమా లోని పాట ఇప్పుడు వైరల్ అయి కొత్త రికార్డులు స్రుష్టిస్తుంది.

అదేమిటి, ఎప్పుడో విడుదల అయిన శ్రీమంతుడు లోని పాట ఇప్పుడు వైరల్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? ఫేస్ బుక్ లో ఒక నార్త్ ఇండియన్ పేజి లో మహేష్ బాబు శ్రీమంతుడు లో ని జత కలిసే సాంగ్ కి హిందీ ఆడియో జోడించి పోస్ట్ చేసారు.

దానికి టోటల్ ఇండియా వైడ్ అధ్బుతమైన స్పందన లభించింది. విపరీతంగా షేర్ లు, లైక్ ల వర్షం కురుస్తుంది. సుమారుగా 3 కోట్ల (31,847,800) వ్యూస్ సొంతం చేసుకుందంటే మాములు విషయం కాదు. అంతే కాదు ఈ వీడియో ని దాదాపు గా 1 మిలియన్ మంది లైక్ చేసారు.

అసలు తెలుగు సినిమాల గురించి తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి సూపర్ గా ఉంది, మహేష్ బాబు అంటే మాకు కూడా ఇష్టం, ఈ సినిమా లింక్ ఇవ్వండి మేము కూడా చూస్తాం అని కామెంట్స్ పెడుతున్నారు.

దీని బట్టి నార్త్ లో మహేష్ కి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తుంది. ఇప్పుడే కాదు మహేష్ అంటే టోటల్ ఇండియా వైడ్ గా గుర్తింపు ఉంది. దటీజ్ సూపర్ స్టార్ మహేష్. మహేష్ కెరియర్లో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా
‘భరత్ అనే నేను’ నిలిచింది. 200 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా తన సత్తా చాటింది.

Share

Leave a Comment