శాటిలైట్ రైట్స్ లో ఆల్ టైం రికార్డ్…

గత చిత్రం జయ అపజయాల తో సంబందం ఉండదు, కొత్త సినిమా ఆదాయానికి ఢోకా ఉండదు. ఇదే ఓ స్టార్‌ హీరో సినిమాకు తీసుకొచ్చే విలువ.

ఓ అగ్ర నటుడు తన అభినయంతో కథను మరో స్థాయికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధమ స్థానం లో ఉంటారు.

రిజల్ట్ తో సంబంధం లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతుండడంతో సినిమాకు సంబంధించిన ప్రతి మ్యాటర్ లో నిర్మాతలకి కాసుల పంట పండుతోంది.

సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ ఉన్నా సరే షూటింగ్ దశలోనే మొత్తం థ్రియేటికల్ రైట్స్ , శాటిలైట్ రైట్స్ ఒప్పందాలు సెట్ అయిపోతున్నాయి.

అలాంటి బిజినెస్ లు ఎక్కువగా మహేష్ బాబు సినిమాలకే జరుగుతుంటాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాపారంలో అతని క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

పోకిరి సినిమా నుంచి మహేష్ ప్రతి సినిమా సినిమాకి బిజినెస్ పెద్దదవుతూ వస్తోంది. గత కొంత కాలంగా ఉహించని విధంగా సినిమా రిజల్ట్ రాకపోయినా సరే మహేష్ మార్కెట్ కొంచెం కూడా డౌన్ అవ్వలేదు.

అతని నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా తెరకెక్కుస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు రీసెంట్ గా వచ్చిన శాటిలైట్ హక్కుల రేట్ గురించి తెలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. శ్రీమంతుడు కాంబినేషన్ కావడంతో బిజినెస్ హై రేంజ్ లో ఉంది.

ఇప్పటికే ఆడియో రైట్స్ లో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. లహరి వారు కొనేశారట అది కూడా రికార్డ్ ప్రైజ్ లో ఈ ఆడియో రైట్స్ అమ్ముడయ్యాయని తెలుస్తుంది.

ఇప్పుడు మహేష్ బాబుకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, కొరటాల లాంటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు భారీ ఆఫర్‌ ను ఇచ్చిందట ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా వారు.

భారీ ఆఫర్‌ అంటే ఇప్పటి వరకు కని విని ఎరుగని రికార్డ్ స్థాయిలో ఆఫర్ ఇచ్చారు. అక్షరాల మొత్తంగా రూ.39 కోట్లను ఆఫర్ చేసిందట.

ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సినిమాకి ఈ స్థాయిలో ఆఫర్ రాలేదు. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించబోతున్నాడు.

పొలిటికల్‌ డ్రామా మేళవించిన యాక్షన్‌/ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌ కథతో ఈ సినిమా ఉంటుంది. త్వరలో సినిమాకి సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ (ఫస్ట్ ఓత్) ని చిత్ర యూనిట్ ప్రకటించబోతోంది.

మరి కొన్ని రోజుల్లో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు అని ఫిల్మ్ నగర్ లో ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రీ రిలీజ్ లో రికార్డులు సృష్టిస్తున్న మహేష్ ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని అభిమానులు చాలా కాంఫిడెన్స్ తో ఉన్నారు.

Share

Leave a Comment