సూపర్ స్టార్ డైరీ ఇప్పుడు ఫుల్

సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం దర్శకుల ఎదురుచూపులు ఇప్పట్లో తీరేలా లేవు. హిట్ ప్లాప్ లతో సంభందం లేకుండా మహేష్ డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరో. అందుకే బడా బడా దర్శకులు కూడా మహేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

మహేష్‌ కోసం కథ రెడీ చేసుకున్న దర్శకులెవరైనా సరే కనీసం ఒక రెండేళ్లు వేచి చూడక తప్పదు. చాలా కాలంగా మహేష్ డేట్స్ కోసం ఎదురుచూసిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫైనల్ గా సూపర్ స్టార్ సినిమాను మొదలుపెట్టనున్నారు. మహేష్ 25 వ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

వంశీ పైడిపల్లి చిత్రం మొదలు పెట్టిన మహేష్‌ దీని తర్వాత సుకుమార్‌తో చేయాలని ఫిక్స్‌ అయిపోయారు. త్రివిక్రమ్‌, రాజమౌళి ప్రాజెక్టులు లైన్లో వున్నాయి కానీ అవి ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా క్లారిటీ లేదు. అర్జున్‌రెడ్డి సినిమాతో స్టార్‌ డైరెక్టర్స్‌ పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో మహేష్‌ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

మహేష్‌ ని దృష్టిలో ఉంచుకొనే ఆయన ఓ కథని సిద్ధం చేసుకొన్నాడని, ఆ కథని కూడా ఇప్పటికే వినిపించాడని ప్రచారం సాగుతోంది. ఇంకా ఎంతో మంది దర్శకులు సూపర్ స్టార్ మహేష్ కోసం కధలు సిద్దం చేసుకుని అతని పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. అగ్రిమెంట్‌ అయిపోయిన వారికే మహేష్‌ ఇప్పుడు దొరకడం లేదు. సూపర్ స్టార్ డైరీ ఇప్పుడు ఫుల్. ఇంకో రెండు సంవత్సరాల వరకూ తీరిక లేకుండా కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయనున్నాడు.

ప్రస్తుతానికి రెండు సినిమాలు ఓకే చేసి పెట్టిన సూపర్ స్టార్ మహేష్‌ రెండిటి కోసం రెండేళ్లు కేటాయించేసాడు. ఎంతో మంది దర్శకులు మహేష్ తో పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నా సూపర్‌స్టార్ డేట్స్ కాలిగా లేవు. రీసెంట్ గా హరీష్ శంకర్ కూడా మహేష్ తో పని చేయలని ఉంది అని తన కోరిక వెల్లబుచ్చిన సంగతి తెలిసిందే. అందరికి మహేషే కావాలి .. ఆయన స్టార్‌డమ్ అలాంటీది.

మహేష్ కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు ఏ చిత్ర పరిశ్రమలో అయినా రాణించగల సత్తా ఉన్న హీరో. మహేష్ ఒకే అనాలే కానీ అతడితో బాలీవుడ్ చిత్రం చేసేందుకు దర్శకులు సిద్ధంగా ఉంటారు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా ఉండడం వలన హిందీ సినిమా సాధ్యం కాకపోవచ్చు. అధికారికంగా ప్రకటించే వరకు వీటిని పుకార్లు గానే భావించాలి.

Share

Leave a Comment