అదరగొట్టిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏం చేసినా కూడా అది స్టయిలిష్గా సూపర్ గా ఉంటుంది.

యాడ్స్ లో మాత్రం మహేష్ రేంజే వేరు. ఎందుకంటే మనోడు ఒక్కసారి కమిట్ అయ్యాడంటే.. ఆ బ్రాండ్ రేంజే మారిపోతుంది.

అదిగో ఇప్పుడు థమ్సప్ యాడ్ చూస్తే అదే అనిపిస్తోంది. ఆ మధ్యన మహేష్ అమెరికా వెళ్ళి మరీ ఒక థమ్సప్ యాడ్ షూట్ చేసి వచ్చాడు.

ఇప్పుడు ఆ యాడ్ ఫైనల్ వర్షన్ ను స్వయంగా సూపర్ స్టారే ట్విట్టర్లో రిలీజ్ చేశాడు.

ఆ యాడ్ చూస్తే.. ఆ రేసింగ్ కారులో.. ఇంటర్నేషనల్ రేసు ట్రాక్ పైన.. మహేష్ ఆ డ్రైవింగ్ సీట్లో.. భలే పర్ఫెక్ట్ ఫిట్ తరహాలో ఉన్నాడు.

మొత్తానికి థమ్సప్ ఛార్జడ్ అంటూ వస్తున్న కొత్త డ్రింక్ కోసం ఈ కొత్త యాడ్ చాలా బాగుంది.

యూస్ లో షూట్ చేసిన ఈ యాడ్ అద్భుతమైన విన్యాసాలతో మహేష్ అభిమానులను అలరించింది. యాడ్ లో మహేష్ చెప్పిన డైలాగ్ “ఇది నేను ఫినిష్ చెయ్యాలి” బాగా అలరించింది.

ఈ యాడ్ కి అటు సినీ వర్గాలు నుంచి మంచి స్పందన వస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో యాడ్ తీసారు అని సినీవర్గాలు అనుకుంటున్నాయి.

యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియో కి లక్షల సంఖ్యలలో లైక్ లు, వ్యూలు వస్తున్నాయి.దీంతో మహేష్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఇక సినిమా విషయానికొస్తే.. ఇప్పుడు మహేష్ బాబు టాలెంటెడ్ డైరక్టర్ కొరటాల శివ డైరక్షన్లో భరత్ అను నేను సినిమాలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగుకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి వేకేషన్ కు ఫారిన్ వెళ్లే పనిలో ఉన్నాడు.

గత యేడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు మహేష్ బాబు. ఈ సారి లండన్ వెల్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా క్రిస్మస్, న్యు ఇయర్ ని విదేశాల్లోనే సెల్ బ్రేట్ చేసుకోబోతోంది మహేష్ బాబు ఫ్యామిలీ..!

Share

Leave a Comment