చెఫ్ సితార ఏం చేస్తుందంటే..

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఎప్పుడు ఏం చేసినా కూడా క్యూట్ గా అల్లరిగా బాగుంటుంది. గతంలో ఒక అవార్డ్స్ ఫంక్షన్ స్టేజీపై డ్యాన్సుతో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ తరువాత నమ్రత షేర్ చేసిన ఏ ఫోటో చూసినా కూడా సితార చిలిపి అల్లరి భలే గమ్మత్తుగా ఉంటుంది.

సితార విషయానికి వస్తే.. చాలా అల్లరి పిల్ల అని ఓ సందర్భంలో మహేష్ అన్నారు. నిజంగానే కొన్ని ఆడియో ఫంక్షన్లో, ప్రైవేట్ కార్యక్రమాల్లో తార చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పటికే మహేష్ బాబు నటించిన సినిమాలోని పాటలకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

సెలబ్రిటీల కుటుంబంలో పుట్టిన పిల్లలకు.. ఇతర పిల్లలు మాదిరి లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే వారికి సెలబ్రిటీ స్టేటస్ తో పాటు.. సెక్యూరిటీ అడ్డుగా నిలుస్తుంది.

సాధారణ లైఫ్ ని తమ పిల్లలు మిస్ కాకూడదనేది మహేష్, నమ్రతల కోరిక. ఓ వైపు సెలబ్రిటీ పిల్లలా పెంచుతూనే.. సంస్కృతి సంప్రదాయాన్ని నేర్పిస్తున్నారు.

బాల్యం లో తెలుసుకోవాల్సినవి వీడియో రూపంలో కాకుండా ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. గత సెలవుల్లో మహేష్ ముద్దుల కూతురు ఏంచేసిందో తెలిస్తే షాక్ అవుతారు.

సితార షెఫ్ గా అయ్యింది. వంట గదిలో కుస్తీలే పట్టలేదండీ.. సరదాగా చాక్లెట్ కేక్ తయారు చేసింది.

తన చిట్టి చేతులతో కేక్ స్టిక్ పట్టుకుని అదరగొట్టేసింది. షెఫ్ గెటప్ లోని సితార చాక్లెట్ అంత ముద్దుగా ఉంది.

ఈ అమ్మడు ఓ చాక్లేట్ తయారు చేసి అందరికీ ఆశ్చర్యపరిచింది. చాక్లెట్ తయారు చేయడమే కాకుండా వాటిని ఇతరులకు తినిపించి సూపర్ గా చేసావ్ అని మెప్పు కూడా పొందింది.

అయితే సితార ఆ చాక్లెట్ ని చేయలేదు లెండి తయారీ దారుడి సహకారంతో ఎలా చేయాలో తెలుసుకొని మరీ చేసింది.

తాజాగా ఫామ్ హౌస్ ఎలా ఉంటుందో నమ్రత సితారకు చూపించారు. ప‌ల్లె ప‌ట్టు అందాల న‌డుమ ఎంత క్యూట్‌గా ఫోటో దిగిందో.. గ‌డ్డి మేస్తున్న ఆవు.. ఆ ఆవు పాలు తాగుతున్న లేగ దూడ‌..!

“త‌ల్లి- బిడ్డ‌ల‌తో క‌లిసి ఎంతో ఆస్వాధిస్తున్నాం. సితార‌, నేను, నా కుటుంబం ఫామ్ వ‌ద్ద ఉన్నాం. గోవుల్ని ప్రేమించాలి. పొలంలో జీవ‌నం .. పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ..“ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

పిల్లలకు ప్రాథమిక అంశాలు కూడా తెలియాలి. అదే ఉద్దేశ్యంతో సితారను ఫామ్ హౌస్ కు తీసుకెళ్లాను అని నమ్రత వెల్లడించారు.

ఈ సారి సితార వంకాయ పొలాల్లో ఉన్న ఫొటొను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వార అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

మహేష్ బాబు కూతురు సితారకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ ఫొటో కనిపించినా.. వీడియో కనిపించినా అవి వైరల్ అయిపోతాయి. దీనికి నెటిజన్ల నుంచి కామెంట్స్, లైక్స్ వెల్లువలా వస్తాయి.

ఇలా తల్లిగా నమ్రత చేయాల్సిన పనులను ఒకటి కూడా మిస్ కాకుండా చేస్తోంది. తండ్రిగా మహేష్ కూడా దొరికిన సమయం మొత్తాన్ని పిల్లల్తో గడపడానికి కేటాయిస్తుంటారు.

Share

Leave a Comment