ప్రేమతో ప్రత్యేకంగా….

సూపర్ స్టార్ మహేష్ బాబుకే కాదు సోషల్ మీడియాలో ఆయన ముద్దుల తనయ సితారకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ రోజు సితార పుట్టినరోజు. ఈ సందర్భంగా సితారకు మహేష్ బాబుతో పాటు నమ్రత, అన్నయ్య గౌతమ్ కృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేసారు.

నేటితో సీతాపాపకు 8 వచ్చేశాయ్! అంటూ ఎంతో ఉద్వేగానికి గురయ్యారు మహేష్. కుమార్తె సీతార ఈ రోజు తన 8 వ పుట్టినరోజు జరుపుకుంది. 12 గంటలకు సూపర్ స్టార్ ఇంట సందడే సందడి నెలకొంది. ఈ స్పెషల్ డే సీతా పాపపై భావోద్వేగంతో ప్రేమతో నిండిన సందేశాన్ని మహేష్ ట్వీట్ చేశారు.

చాలా వేగంగా ఎనిమిదిలో అడుగు పెట్టేశావ్. ఎప్పటికీ ఇలానే అపరిమితంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మహేష్ తన గారాల కుమార్తె నుద్ధేశించి ట్వీట్ చేశారు. వెంటనే ఈ ట్వీట్ నెట్టింట్ వైరల్ అయిపోయింది.

#SituPapaTurns8 అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు. సితార జీవితంలో అరుదైన క్షణాలకు సంబంధించిన ఓ చిన్న వీడియోను కూడా పంచుకున్నారు. ఈ వీడియో ఎంతో చూడముచ్చటగా ఉండంటంతో లైక్స్ ఆండ్ రీట్వీట్స్ తో దూసుకెల్తుంది.

తండ్రితో పాటు షూటింగ్స్, సినిమా వేడుకలకు హాజరయ్యే సితార సామాజిక మాధ్యమాల్లో చేసే సందడికి వీరాభిమానులున్నారు. సితార ప్రతి పండగకు చేసే సందడి మామూలుగా ఉండదు. వినాయక చవితి, క్రిస్మస్, సంక్రాంతి, దసరా పండగ ఏదైనా సితార చేసే సందడి ఆషామాషీగా ఉండదు.

సూపర్ స్టార్ మహేష్ కి వారసులు గౌతమ్ సితార అంటే పంచప్రాణాలు అన్న సంగతి తెలిసిందే. వారసుల జీవితాల్లో ఎన్నో ఎగ్జయిటింగ్ మూవ్ మెంట్స్ ని ఆయన సోషల్ మీడియాల్లో అభిమానులకు చేరవేస్తున్నారు. ఇద్దరు ఇప్పటికే సెలబ్రిటి స్టేటస్ అందుకున్నారు.

ఇక మన సూపర్‌స్టార్మ హేష్ విషయానికి వస్తే షూటింగ్‌లలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాడు మహేష్‌. అంతేకాదు ప్రతీ సినిమా పూర్తయిన తరువాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు ట్రిప్‌కు వెళ్లటం మహేష్‌కు అలవాటు.

ప్రస్తుతం కరోనా కారణంగా మూడు నెలలుగా ఇంట్లోనే ఉంటున్న మహేష్ బాబు పూర్తి సమయాన్ని ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. తాను ఇంట్లో చిన్నారులతో కలిసి చేసే అల్లరినీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం మహేష్ 27వ సినిమా త్వరలో సెట్స్ కి వెల్లనుంది. ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు.

Share

Leave a Comment