ఇదో అసాధారణ చరిత్ర..

హీరోలను స్టార్‌గా మార్చాలన్నా ఆ స్టార్‌కు ఓ ఇమేజ్ కట్టబెట్టాలన్నా, హీరో స్థాయిని పదింతలు పెంచాలన్నా అది కేవలం దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావుకే చెల్లుతుంది. అప్పటి వరకు బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో అదరగొట్టిన మహేష్ బాబును మొదటగా పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టేందుకు రాఘవేంద్రరావు పూనుకున్నాడు.

మహేష్ ను హీరోగా పరిచయం చేయాలని అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారి వద్దకు చాలా మంది దర్శకులు క్యూ కట్టారు. కృష్ణ గారు మాత్రం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారిని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. కె.రాఘవేంద్ర రావు గారి టేకింగ్ తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.

మహేష్ బాబును రాజకుమారుడుగా చేశాడు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో మర్చిపోలేనిది. ఎంతోమంది అభిమానులను సంపాదింది పెట్టింది రాజకుమారుడు సినిమా. సినిమాలో ప్రీతిజింతా మహేష్ బాబుల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ప్రేక్షకులకు అయింది.

రాజకుమారుడు సినిమాను 116 సెంటర్స్ లలో 78 ప్రింట్లతో రిలీజ్ చేశారు. మొదటిరోజే మహేష్ రాజకుమారుడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మరిన్ని కాపీలకు బయ్యర్లు ఆర్దర్ చేశారు. సినిమా 80 సెంటర్లలో పైగా 50 రోజులు ఆడింది. ఇక 44 సెంటర్లలో 100 రోజులు ఆడింది.

అయితే రాజకుమారుడు సినిమా విడుదలై 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బంధం సహా హీరో మహేష్ బాబు హీరోయిన్ ప్రీతిజింతా ఈ సినిమా యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజకుమారుడు హిట్‌ ఇచ్చినందుకు రాఘవేంద్రరావు, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సినిమా అనుభవంతో నటనలో తనెంతో నేర్చుకున్నట్లు, అది ఎప్పటికీ తన మదిలోనే ఉంటాయని వెల్లడించాడు. రాఘవేంద్ర రావు, చిత్ర యూనిట్‌తో కలిసిన పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఓ వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేశాడు మహేష్ బాబు.

రాజకుమారుడు సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మహేష్ బాబు రాఘవేంద్ర రావు కి కృతజ్ఞతలు. మీతో పని చేసిన అనుభవం ఎంతో గొప్పది ఆ జ్ఞాపకాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు హీరోయిన్ ప్రీతిజింతా.

రాజకుమారుడు కి 21 వసంతాలు. ఎన్నో మధుర జ్ఞాపకాలు. మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను పోస్ట్ చేశాడు రాఘవేంద్రరావు.

సినిమా రిలీజ్ కు ముందే మణిశర్మ గారు అందించిన సంగీతం సూపర్ హిట్ గా నిలిచింది. గోదారి గట్టుపైన, ఎందుకీ ప్రాయము, రాంసక్కనోడమ్మా సాంగ్స్ తో పాటు అన్ని పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. అప్పటి నుంచి మాక్సిమమ్ మహేష్ మణిశర్మనే తన సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకునేవారు.

ఏ హీరోకి తన మొదటి సినిమాకి దక్కని ఘనవిజయం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ పవర్ ఇది. రాజకుమారుడు లో సూపర్ స్టర్ కృష్ణ గారు కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో తలుక్కున మెరిసారు. రాజకుమారుడు విజయంతో ఇక మహేష్ కు వెనుక తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

నూనూగు మీసాల రాజకుమారుడుగా కెరీర్ ప్రారంభించి సూపర్ స్టార్‌గా మహేష్ బాబు ఎదిగిన తీరు అమోఘం. ఇదో అసాధారణ చరిత్ర. మొదటి సినిమాకి ఇప్పటికి మహేష్ లో ఎంతో పరిణతి, ఎంతో మార్పు. తొలి సినిమాతో 25వ సినిమా వసూళ్లు ఎంత అని పోల్చి చూడడం సరికాదు కానీ అలా పోల్చి చూస్తే 20 రెట్లు స్టార్డమ్ పెరిగిందని మాత్రం అంచనా వేయొచ్చు.

లక్షలాది అభిమానులను సంపాదించుకున్న మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో పలు అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్నారు మహేష్. తెలుగు రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. హీల్ ఎ చైల్డ్ అండ్ రైన్ బో హాస్పిటల్స్ కు తన సంపాదన లోని కొంత భాగాన్ని చారిటీ గా అందిస్తున్నారు.

Share

Leave a Comment