కొత్త స్టైల్లో సూపర్‌స్టార్

తెలుగు ఇండస్ట్రీ లో అత్యధిక బ్రాండ్లకు అంబాసిడర్ గా కొనసాగుతున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు ఇదొక పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో టాప్‌లో ఉన్న కంపెనీలన్నీ సౌత్ మార్కెట్‌ కోసం సూపర్ స్టార్ మహేష్‌ వద్దకే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్న ప్రాంతీయ భాష స్టార్ ఎవరైన ఉన్నారంటే అది కేవలం మన సూపర్ స్టార్ మహేష్ బాబు.

నేషనల్ వైడ్ ఆయనికి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదు అనడంలో సందేహం లేదు. అందుకేనేమో పలు అంతర్జాతీయ బ్రాండ్స్ సూపర్ స్టార్ మహేష్ తో తమ్ ప్రొడక్ట్స్ కు ఎండార్స్మెంట్ చేయించుకుంటాయి. రెండు డజన్ల పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వన్ ఆండ్ ఓన్లీ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఆయన ఖాతాలో మరో అంతర్జాతీయ బ్రాండ్ ‘ఫ్లిప్ కార్ట్’ చేరిన సంగతి తెలిసిందే.

పండుగల సీజన్‌ నేపథ్యంలో ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌లో ‘ది బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ ప్రారంభించనుంది. దీనికి సంబంధిచిన ప్రోమోను తమ ఫ్లిప్‌కార్ట్‌ యూట్యూబ్ ఎకౌంట్‌లో విడుదల చేసారు. ఈ యాడ్ చూసిన వారు ఎవరైనా సూపర్‌స్టార్ కొత్త లుక్ కి ఫిదా అవ్వాల్సిందే. సరికొత్త హెయిర్ స్టైల్‌తో అదిరిపోయే రేంజ్‌లో ఉన్నారు మహేష్.

‘బడ్జెక్ట్ ని బట్టే కదా మనం అన్నీ ప్లాన్ చేస్తాం, లైక్ దీని అవసరం లేదే, ఈ రోజు టైం బాగోలేదే, మా నాన్న చెప్పినట్లు 90 శాతం మార్క్స్ తీసుకురా అప్పుడు చూద్దాం. ఇప్పుడు దేని బట్టి ప్లాన్. అయిదు రోజులు ఇండియా పొందుతుంది బడ్జెక్ట్ నుండి ముక్తీ అని తన స్టైల్లో అదరకొట్టారు మహేష్ బాబు. ముఖ్యంగా తన కొత్త లుక్ మరియు హెయిర్ స్టైల్‌తో కట్టి పడేసారు మన సూపర్‌స్టార్.

ఈ సేల్‌ కోసం సెలబ్రిటీలు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణే, విరాట్‌ కోహ్లితో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. రీజనల్ యాక్టర్స్ నుండి కేవలం మహేష్ బాబు ఒక్కడే ఈ లిస్ట్ లో ఉన్నాడంటే ఆయనకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియా వైడ్ పాపులర్ స్టార్స్ తో టై అప్ అయి ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ మరింత ప్రమోట్‌ చేయనుంది.

తెలుగు హీరోల్లో ఇన్ని బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరించిన వారు లేరు. అలాగే ప్రకటనల ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని అందుకున్న హీరోల జాబితాలోనూ మహేష్ నంబర్ వన్ గా నిలిచారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు టోటల్ సౌత్ ఇండియా లోనే మహేష్ ప్రధమ స్థానం లో ఉన్నాడు.

ఆయన బ్రాండ్ వాల్యూ కి దరిదాపుల్లో కూడా మరే హీరో లేరంటే సూపర్‌స్టార్ క్రేజ్ ఎంటో తెలుస్తుంది. మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తన 25వ సినిమా మహర్షి ను గ్యాప్ లేకుండా చేసేస్తున్నారు. ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్, 2019న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Share

Leave a Comment