డైరక్టర్స్ డిలైట్

అద్భుతమైన కథ, కథనాలతో తో ఎప్పుడు కొత్తదనం ని అందించడం తో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా అటు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని మంత్రముగ్దుల్ని చేసే ఏకైక హీరో మహేష్ బాబు. కొన్ని సినిమాలు బ్లాక్‌బస్టర్లు అవుతాయి మరి కొన్ని సరిగ్గా ఆడవు కాని మహేష్ నటనికి మాత్రం ఎవరు వంక పెట్టలేరు అనేది మనందరికి తెలిసిన విషయమే.

మహేష్ బాబు కేవలం తన కళ్ళతో హావాబావలని పలికించేస్తాడు. అలాంటి గూస్‌ బంప్స్ తెప్పించే షాట్స్ తన ప్రతీ చిత్రం లో ఒకటికి మించి మరొకటి ఉంటాయి. ఎప్పటికప్పుడు ఇది బెస్ట్ అనుకునెలోగ కొత్త చిత్రం లో దానికి మించిన నటన ప్రదర్సించడం సూపర్‌స్టార్ కి అలవాటు. ఇంటెన్సిటీ లో మహేష్ అందరికంటే చాల ముందు ఉన్నాడు.

మహేష్ బాబు ప్రత్యేకమైన నటుడని.. ఆ ప్రత్యేకతే తను చేసే పాత్రను అంత బాగా ఎలివేట్ చేస్తుందని, మహేష్ డెడికేషన్ లెవెల్స్ ఆయన కమిట్మెంట్ చాల అద్భుతమని అందరు దర్శకలు నిర్మొహమాటంగా చెప్పే మాట.

ఈ జనరేషన్ లో ధి మోస్ట్ ఇంటెన్స్ హీరో ఎవరు అంటే మరో మాట మాట్లడకుండా ఠక్కున సూపర్ స్టార్ మహేష్ బాబు పేరే అందరు చెప్తారు. అలాంటి ఒక ఇంటెన్స్ హీరో ని మన టాలివుడ్ డైరెక్టర్స్ రకరకాలుగా ప్రజెంట్ చేసి అన్ని వర్గాలను మిప్పించారు.

అగ్ర హీరోలలో ప్రయోగాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే, దానికి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబే అని చెప్పాలి. మహేష్ ఎంపిక చేసుకున్న కధలు, వాటి కొత్తదనాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.

నిజానికి ఆ గట్సే మహేష్ బాబును ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పవచ్చు. వరుసగా మాస్ సినిమాలు చేసుంటే క్రేజ్, సక్సెస్ లు ఇంతకు మించి వచ్చుండేవేమో గానీ, ఇంత పేరు ప్రఖ్యాతలు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండేవి కావు.

మహేష్ కి మరొక పేరు కూడా ఉంది. అదేనండి, డైరక్టర్స్ డిలైట్ అని మహేష్ ని టాలివుడ్ లో అందరు అంటారు. దర్శకుడి కి ఎల కావలంటే అల తన బాడి లాంగ్వేజి ని మార్చుకుంటాడు, మహేష్ ఒక పరిపూర్ణ నటుడు అని సీనియర్ ఆర్టిస్ట్స్ అందరు చెప్పే మాట.

ఎక్కువ మాట్లాడకుండానే ప్రభావం చూపించగలడు, వాయిస్ పెంచకుండా మాట్లాడినప్పటికీ జనాలు అతడి మాటలు వినేలా ఉంటాయి. అతిగా అనవసర దూకుడు చూపించకుండానే ఇంటెన్సిటీ కనిపించేలా చేస్తాడు. ఇందుకే మహేష్ మన టాలివుడ్ స్థాయి ని అంతర్జాతీయంగా ఒక మెట్టు పైకి ఎక్కించగలిగాడు.

Share

Leave a Comment