అమూల్య‌మైన‌ క్ష‌ణాలు…

వారం రోజుల క్రితం ఫ్యామిలీతో క‌లిసి మ‌హేశ్‌ బాబు ఫ్లైటెక్కిన విష‌యం తెలిసిందే క‌దా. మ‌హేశ్ హాలీడే ట్రిప్ ప్లాన్ చేసింది మ‌రెక్క‌డికో కాదు, దుబాయ్‌లో ఉంటున్న శిల్పా శిరోద్క‌ర్ ఇంటికే. అవును న‌మ‌త్ర అక్క‌ శిల్పా శిరోద్క‌ర్‌ ఇంటికి కుటుంబంతో స‌హా వెళ్లిన మ‌హేశ్ అక్క‌డే దీపావ‌ళిని సెల‌బ్రేట్ చేసుకున్నారు

ప‌నిలో ప‌నిగా అక్క‌డి అంద‌మైన ప్ర‌దేశాల‌ను చుట్టొస్తూ ప్ర‌తిక్ష‌ణాన్ని పిల్ల‌ల‌తో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా ఫొటోను నమ్ర‌త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో సూప‌ర్ స్టార్ కుటుంబంతో పాటు శిల్పా శిరోద్క‌ర్, ఆమె భ‌ర్త‌, కూతురు ఉన్నారు

ఇల్లు కాని ఇంట్లో సేద తీరుతున్నాం. గ‌త రాత్రి మ‌ర్చిపోలేనిది. అస‌లు ముఖానికి మాస్కులే లేవు (ఫొటో వ‌ర‌కు మాత్ర‌మే) దీపావ‌ళి పండ‌గ రోజు అంతా క‌లిసి బ‌య‌ట భోజ‌నం చేశాం. అయినా పండ‌గను ఫ్యామిలీతో జరుపుకోడానికి మించిన‌దేం ఉంటుంది

ఇలాంటి క్ష‌ణాలు అమూల్య‌మైన‌వి అని న‌మ్ర‌త‌ రాసుకొచ్చారు. కొడుకు, కూతురుతో రెస్టారెంటు లో భోజ‌నం చేస్తున్న ఫొటోను సైతం ఆమె‌ అభిమానుల‌తో ఇదివ‌ర‌కే పంచుకున్నారు. తాజాగా మహేష్‌ మరింత కొత్తగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది

మునుపటి కంటే మరింత యంగ గా సూపర్‌స్టార్ కనిపిస్తున్నారు. ఇక ఈ ఫొటోలో అత్యంత స్టైలిష్ గా గాగుల్స్ ధరించి రాయల్ లుక్ లో కనిపించిన సూపర్ స్టార్ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వేలకు పైగా షేర్స్ లక్షల్లో లైక్స్ వచ్చాయి

ప్రతి సినిమా షూటింగ్ కి ముందు విడుదల తరువాత ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లడం, మహేష్ కి ఆనవాయితీగా ఉంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తన తదుపరి చిత్రాన్ని కూడా త్వరలో సెట్స్ మీదకి తీసుకువెళ్ళనున్నాడు

స‌ర్కారు వారి పాట తో మ‌రో హిట్టు త‌న ఖాతాలో వేసుకునే ప‌నిలో ప‌డ్డారు. స‌మాజానికి స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వ‌నున్న ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్‌ జీఎమ్‌బి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

Share

Leave a Comment