సుకుమార్ ఫ్యామిలీకి దీపావళి గిఫ్ట్

సూపర్‌స్టార్ మహేష్ బాబు, ఈ పేరు చాలు కోట్లాది మంది అభిమానులు ఆనందంతో సంబరాలు చేసుకోవటనికి. ఆయన యాక్టింగ్‌కి ఎంత మంది అభిమానులు ఉంటారో ఆయన వ్యక్తిత్వానికి కూడా అంతే మంది అభిమానులు ఉంటారు. ముఖ్యంగా సినిమాలను, ఫ్యామిలీ లైఫ్‌ని ఆయన బ్యాలెన్స్ చేసే తీరుకి అందరూ ఫిదా అవుతారు.

మహేష్ ఇండస్ట్రీలోని చాలా తక్కువ మందితో క్లోజ్‌గా ఉంటారు. కానీ ఒక సారి క్లోజ్‌ అయితే ఆ స్నేహాన్ని కొనసాగిస్తారు. దీపావళి పండగను పురస్కరించుకుని తమకు మహేష్ దంపతులు ఒక బహుమతి ని పంపారని సుకుమార్ భార్య తబిత గారు తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో పోస్ట్ చేసారు.

థాంక్యూ అని మహేష్‌బాబు, నమ్రత లను ట్యాగ్ చేసారు తబిత సుకుమార్. మహేష్ బాబు, సుకుమార్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినట్లు దీని బట్టి మనకు తెలుస్తుంది. నమ్రత, తబిత మరియు వంశీ పైడిపల్లి భార్య మంచి రిలేషన్ మైన్‌టైన్ చేస్తున్నారు. వీళ్ళంతా గోవాలో జరిగిన వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలకు కూడా వెళ్ళిన సంగతి తెలిసిందే.

ప్రతీ దీపావళి కి తమ స్నేహితులకు బహుమానాలను పంపటం మహేష్‌బాబు దంపతులకు అలవాటు. పోయిన ఏడాది ఇండస్ట్రీ వాళ్ళకే కాకుండా తనను కలిసిన చిన్నారులకు కూడా బహుమతులను పంపాడు మహేష్. స్పైడర్ షూటింగ్ సమయంలో ఆ చిన్నారులను కలుసుకున్నాడు మహేష్.

మొన్నటి వరకు మహర్షి షూటింగ్ కోసం మహేష్ బాబు న్యూయార్క్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ ముగియడంతో హైదరాబాద్ తిరిగివచ్చారు. అంటే దీపావళి పండుగను మహేష్ హైదరాబాద్ లోనే జరుపుకోనున్నారు అనమాట. త్వరలో మహర్షి నెక్స్ట్ షెడ్యూల్‌లో పాల్గొంటారు మహేష్.

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం మహర్షి. సూపర్ స్టార్ ఇప్పటి వరకు చేసిన సినిమాలను మించిపోయేలా, ఒక గొప్ప ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనే అంచనాలు అభిమానుల్లో ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడమే కాకుండా ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తూనే సబ్జెక్ట్ విషయంలోనూ ఫ్రెష్ నెస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Share

Leave a Comment