మహేష్ నుంచి దీపావళి కానుకలు..

చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయాలకు ప్రతీకగా దీపావళి పండగను జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రముఖమైన ఈ పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు

అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెలుగు ఇచ్చే ప్రేమ, ఆశ, సంతోషాన్ని అందరికీ పంచుదాం. అలాగే కాలుష్యం నుంచి మనల్ని, మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తుంచుకోండి. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండి కుటుంబంతో కలిసి వేడుక నిర్వహించుకోవాలని మహేష్ సూచించారు

ప్రతీ సంవత్సరం దీపావళి సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకమైన గిఫ్టులు అందిస్తుంటారు మహేశ్ నమ్రత జంట. ఈ ఏడాది వీరు దుబాయ్ లో హాలీడేలో ఉన్నారు. అయినా.. తమ శ్రేయోభిలాషుల కోసం గిఫ్ట్ బాక్సులు పంపించారు

అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మహేశ్, నమ్రత, గౌతమ్, సితార అంటూ ఉన్న గ్రీటింగ్ కార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుంచి గిప్ట్ అందుకున్న సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తూ వారు అందుకున్న గిఫ్ట్‌ను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తున్నారు

మహేష్ బాబు దర్శకుల హీరో అని చెబుతుంటారు. డైరెక్టర్స్ చెప్పినట్టుగా చేస్తూ వారి నిర్ణయాలకు గౌరవిస్తాడని అందరూ అంటారు. మహేష్ బాబు తన దర్శకులను ఫ్యామిలీ మెంబర్స్‌లా ట్రీట్ చేస్తుంటాడు. అందుకే స్పెషల్ ఈవెంట్లకు తన తనతో వర్క్ చేసిన అందరికీ, ప్రత్యేకంగా డైరెక్టర్లకు స్పెషల్ ట్రీట్‌లు ఇస్తుంటాడు.

దీపావళి ఇంటికి ఎర్లీగా వచ్చిందంటూ మహేశ్, నమ్రతకు థ్యాంక్స్ చెబుతూ వారందరూ ట్వీట్ చేసారు. ఏదేమైనా కూడా గుర్తు పెట్టుకుని అందరికీ ఇలా బహుమతులు పంపించడం మాములూ విషయం కాదు. అందుకే మహేష్ సూపర్‌స్టార్ అయ్యాడు

ప్రస్తుతం మహేష్ బాబు దుబాయి ‌లో తన కుటుంబంతో కలిసి క్వాలిటీ టైం ను గడుపుతున్నా విషయం అందరికీ తెలిసిందే. శిల్పా శిరోద్కర్ ఫ్యామిలీ బర్త్ డే వేడుకల్లో మహేష్ బాబు కుటుంబం సందడి చేసింది. పిల్లలతో కలిసి మహేష్ బాబు కూడా చిన్న పిల్లాడిలా మారిపోయాడు

అక్కడ తన పిల్లలతో కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నాడు. తాజాగా ప్రేక్షకులకు అభిమానులు దీపావళి విషెస్ తెలిపాడు. కాలుష్యానికి దూరంగా ఉండండని కోరాడు. ఎప్పుడూ వెలుగుతూ ఉండాలని అన్నాడు

ఇక సినిమాల విషయానికి వస్తే దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

Share

Leave a Comment