మహేష్ భారీ విరాళం

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భారీగానే విరాళం అందించాడు. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈయన సాయంలో కూడా సరిలేరు అనిపించుకున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించాడు సూపర్ స్టార్. దాంతో పాటు కరోనా వైరస్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న చర్యల పై ప్రశంసల వర్షం కురిపించాడు మహేష్.

ఓ బాధ్యత గల వ్యక్తిగా ఇంట్లోంచి కాలు బయటికి పెట్టకూడదని అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దంటూ కోరాడు మహేష్ బాబు. అందరూ ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాలని 21 రోజులు ఇంట్లోనే ఉండాలని కోరాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అందరూ లాక్ డౌన్ రూల్స్ పాటిద్దామంటూ లెటర్ విడుదల చేసాడు. మానవత్వం గెలుస్తుంది.. కచ్చితంగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తామంటూ తెలిపాడు మహేష్ బాబు. మనకు మనమే రక్షణగా ఉండాల్సిన సమయం వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు.

మంచి సోర్సు నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలంటూ మహేష్ కోరారు. ఇలాంటి సమయాల్లో లేనిపోని పుకార్లు నమోద్దన్నారు మహేష్. ప్రార్థిద్దాం, ఆశిద్ధాం, కలిసి కట్టుగా కరోనాపై అందరితో కలిసి పోరాడి జయిద్దాం అంటూ మహేష్ కరోనాకు సంబంధించి వరుసగా ఆరు ట్వీట్లు పెట్టారు.

కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటూ.. ఆరు నియమాలు మనం తప్పకుండా పాటించాలని కోరాడు మహేష్. ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితుల్లో మనమంతా ఈ ఆరు నియమాలు తప్పక పాటించాలన్నారు. దీనికి నెటిజన్స్ కూడా బాగా స్పందిస్తున్నారు. తప్పకుండా పాటిస్తాం అన్నయ్య అంటూ ట్వీట్లు పెడుతున్నారు

Share

Leave a Comment