ఎదుగుదల చూసి గర్వపడుతున్నా…

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇద్దరు పిల్లల విషయంలో ఎంత ప్రేమ చూపిస్తాడో మనం రెగ్యులర్ గా కూడా చూస్తూనే ఉన్నాం. నమ్రత సోషల్ మీడియాలో మహేష్ బాబు మరియు పిల్లల బాండ్డింగ్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది

ఇక నేడు మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో సూపర్ స్టార్ మహేష్ కొడుకు గౌతమ్ ఎదుగుదలకు మురిసిపోతున్నారు. ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు

గౌతమ్ పొత్తిళ్లలో ఉన్న ఫొటోతో పాటు, యువకుడిగా తనతో సరదాగా గడుపుతున్న గౌతమ్ ఫోటోలను మహేష్ పంచుకున్నారు. మహేష్ బాబు కూడా కొడుకు గౌతమ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఓ ఎమోషన్ నోట్ కూడా దానికి జోడించడం జరిగింది

హ్యాపీ 14 మై సన్. నీ ఎదుగుదుల చూస్తుంటే గర్వంగా ఉంది. డోరామన్ నుండి అపెక్స్ లెజెండ్స్ వరకు వరకు నీవు ఒక పర్ఫెక్ట్ యువకుడిగా ఎదిగిన తీరుకు గర్వంగా ఉంది. నీతో పాటు ఎదిగిన జర్నీ సూపర్. ఎప్పటికి సంతోషంగా ఉండాలి లవ్ యూ అంటూ ట్వీట్ చేశాడు

మహేష్ బాబు తన ఒడిలో ఉన్న గౌతమ్ ఫొటోను మరియు ఇప్పుడు ఎదిగిన తర్వాత ఫొటోను రెండింటిని అభిమానులతో షేర్ చేసుకున్నాడు మహేష్ తన ట్వీట్ లో కొడుకు గౌతమ్ పట్ల తనకున్న అపరిమితమైన ప్రేమను బయటపెట్టడం జరిగింది

నేడు గౌతమ్ కు 14వ పుట్టిన రోజు సందర్బంగా నెట్టింట పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.ఇక మహేష్ ఫ్యాన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా గౌతమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

కాగా గౌతమ్ బాల నటుడిగా ఇప్పటికే ఓ చిత్రంలో నటించారు. సుకుమార్ దర్శకత్వంలో 2014లో విడుదలైన సైకలాజికల్ థ్రిల్లర్ నేనొక్కడినే చిత్రంలో గౌతమ్ నటించడం జరిగింది. మరో వైపు మహేష్ తన నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట చిత్ర షూటింగ్ కి సిద్ధం అవుతున్నారు

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

మహేష్ చేయబోతున్న పరుశురాం సర్కారు వారి పాట సినిమా కూడా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అందుకు అనుగునంగా ఆయన కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. కమర్షియల్ సబ్జెక్ట్ అని చెప్తూనే ప్రయోగాలతో కెరీర్ ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నాడు ప్రిన్స్

Share

Leave a Comment