చాలా అదృష్టవంతుడిని..

తమ అభిమాన కథానాయకుడు మహేష్‌బాబుకి పుట్టినరోజు కానుకగా ఆయన అభిమానులు జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇవ్వడం విశేషం. 60.2 మిలియన్ల బర్త్‌డే విషెస్‌ ట్వీట్లతో తమ అభిమాన కథానాయకుడు మహేష్‌బాబు పేరుతో వరల్డ్‌ రికార్డ్‌ని క్రియేట్‌ చేశారు

అలాగే మహేష్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజ్‌ చేసిన సర్కారు వారి పాట మోషన్‌ పోస్టర్‌కి సైతం అద్భుతమైన స్పందన రావడంతో మహేష్‌బాబు ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. తన పుట్టినరోజుకి అమూల్యమైన గిఫ్ట్‌ని అందజేసిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు మహేష్‌బాబు

సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగభరిత ట్వీట్‌ చేశారు. ప్రతి సంవత్సరం నా పుట్టిన రోజు, మీరందరూ నా మీద చూపించే ఈ ప్రేమ నేనెంత అదృష్టవంతుడినో నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఎంతో అభిమానంగా పంపిన మీ విషెస్‌ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది

నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఫ్యాన్స్‌కి మీరు పంపిన అభినందనలకు, దీవెనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేమతో మీ మహేష్‌ బాబు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీని బట్టి మహేష్ కి అభిమానులంటే ఎంత ఇష్టమో మరో సారి తెలిసింది

మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభినందనలు తెలుపుతూ అభిమానులు ట్విట్టర్‌లో 60.2 మిలియన్‌ ట్వీట్స్‌తో 24 గంటల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ట్వీట్‌ చేయబడిన హాష్‌టాగ్‌గా రికార్డ్‌ సష్టించింది. ప్రముఖ సోషల్‌ మీడియా మాధ్యమం అయిన ట్విట్టర్‌లో ఈ వరల్డ్‌ రికార్డ్‌ సాధించడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు

తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలను నాటి అభిమానులందరూ ఈ పర్యావరణ కార్యక్రమంలో భాగం కావాలని మహేష్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విజయ్ శృతిహాసన్ పాల్గొనాలని ఈ చాలెంజి వారు కంటిన్యూ చేయాలి అన్నారు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సరిహద్దులు దాటాలని కోరుకుంటున్నాను. పచ్చదనం వైపు మనమందరం అడుగులు వేయాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌ని సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు పిలుపునిచ్చారు

అలాగే తన తాజా చిత్రం సర్కారు వారి పాట మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందులో మహేష్ పాత్రలో సర్ ప్రైజ్ ఉంటుందని అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఇంతకుముందు రిలీజైన మహేష్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది

టోటల్ పోస్టర్ లో ఎన్నో విషయాలు చెప్పాడు పరశురామ్. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రం అన్ని రకాల కోవిడ్‌ జాగ్రత్తలతో త్వరలోనే సంబంధించిన చిత్రీకరణను ఆరంభించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది అని వినికిడి.

Share

Leave a Comment