ఈ ముగ్గురూ ప్రత్యేకం..!!

మహిళ విజయం వెనుక పురుషుడు ఉండకపోవచ్చేమో కానీ, ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉంటుందంటారు. అంతేకాదు జయాపజయాలకు అతీతంగా అన్నివేళలా అతని వెన్నంటే నిలుస్తుంది. అతనికి తోడూనీడగా, చేదోడువాదోడుగా ఉంటూ అంతా తానై చూసుకుంటుంది.

ఇది కేవలం సామాన్యుల విషయంలోనే జరుగుతుందనుకుంటే పొరపాటే. సెలబ్రిటీలు ఇందుకు మినహాయింపు కాదంటున్నాడు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు వ్యక్తులకు నిన్న శుభాకాంక్షలు తెలియజేశాడు.

మహేష్ బాబు తన వృత్తి కోసం ఎంతటి డెడికేషన్ చూపిస్తాడో కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు. తన తల్లి, సతీమణి నమ్రత, కుమార్తె సీతారపై మహేష్ అమితమైన ప్రేమని ప్రదర్శిస్తాడు. మరోమారు ఈ ముగ్గురిపై మహేష్ శక్తివంతమైన సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు.

తనకు జన్మనిచ్చిన ఇందిరా గారి, అర్ధాంగి నమ్రతా శిరోద్కర్‌, చిరునవ్వులు చిందించే కూతురు సితార ఫొటోలను పంచుకున్నాడు. ఈ ముగ్గురు నా ఉనికిని ప్రభావితం చేశారు. నాతో ఉన్న ఈ మహిళలందరి శక్తి అనిర్వచనీయం. వీళ్లతో పాటు మహిళామణులందరూ మరింత శక్తిమంతంగా ఎదుగుతూ మరింత ముందుకు సాగాలి అని ట్వీట్‌ చేశాడు.

నమ్రత సైతం తన తల్లి ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నా మార్గదర్శకురాలు, నా ఉనికిలో ఉండే నా ఆత్మ, ప్రతిరోజూ ఆమె శక్తి నాతో ఉందని తెలిసి ముందుకు సాగుతున్నా. తన ఆశీర్వాదం ఆమెలాగే బలంగా ఉండటానికి నాలో నిరంతరం ప్రేరణను కలిగిస్తుంది.

ఆమె లైఫ్ టైమ్ నా మనిషి, నేను ఆమె హ్యాపీ ఉమెన్స్, హ్యాపీ ఉమెన్స్ డే అని విషెస్ తెలిపారు. మహేష్ తల్లిగారైన ఇందిరా దేవి గారి ఫోటోని కూడా నమ్రత షేర్ చేశారు. మహేష్ బాబు ఇటు నటుడిగా, అటు సినిమా, వ్యాపార రంగాల్లో అగ్రస్థాయికి ఎదగడంలో ఆమె కీలకపాత్ర పోషించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మహేష్ నమ్రత ల బందం ఎంతో చూడముచ్చుటగా ఉంటుంది. ఎటువంటీ భేషాజాలాలకి పోకుండా ఎన్నోసార్లు మహేష్ తన సతీమణి నమ్రత గురించి ఇంటర్వ్యూలలో థి బెస్ట్ వైఫ్ అని చెప్తూ వచ్చారు. నా బ్యాక్‌బోన్ నా సతీమని నమ్రత. నా జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది.

నేను కేవలం ఆమెను అమితంగా ప్రేమించడమే కాకుండా చాలా విషయాలు ఆమే మీదే ఆధరపడతాను. పిల్లల విషయం లో నమ్రత బెస్ట్ మదర్. వాటినన్నింటిని ఆమే చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాండిల్ చేస్తుంది అని సూపర్‌స్టార్ మహేష్ బాబు ఒక సందర్భంలో తెలిపారు.

కాగా మహేశ్‌ సినిమాల విషయానికొస్తే పరశురామ్‌తో ఓ సినిమా చేయనున్నాడని, మరోవైపు చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ కీలక పాత్రను పోషించనున్నాడని అనేక వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Share

Leave a Comment