ఇలాంటి రెస్పాన్స్ ఎప్పుడూ చూడలేదు

సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్‌తో టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే మహేష్ బాబు కెరియర్‌లోనే రికార్డు షేర్ వసూలు చేసి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. గ్రాండ్ విక్టరీ కొట్టిన సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ ఆదివారం నాడు హైదరాబాద్‌లో థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో స్పీచ్‌తో అదరగొట్టారు మహేష్.

తెలుగు సినిమా ఆడియ‌న్స్ కీ, నాన్న‌గారి అభిమానుల‌కీ, నా అభిమానుల‌కీ సిన్సియ‌ర్ గా ధ‌న్య‌వాదాలు. జ‌న‌వ‌రి 11నే సంక్రాంతిని మాకు ఇచ్చారు. ఇవాళ పొద్దున్నే నేను, దిల్‌రాజుగారు, అనిల్ సుంక‌ర క‌లిసి షేర్స్ మాట్లాడుకుంటూ మిరాకిల్స్ ఫీల‌య్యాం. నిజంగా మైండ్ బ్లాక్ అయింది. హ్యాట్సాఫ్ టు తెలుగు సినిమా. టెక్నీషియ‌న్స్ అంద‌రికీ థాంక్స్.

త‌మ్మిరాజు, శేఖ‌ర్ మాస్ట‌ర్ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఆర్టిస్టులు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. రిలీజ్ రోజు సినిమాను నా పిల్ల‌ల‌తో చూస్తాను. అది నాకు సెంటిమెంట్‌. నేను నిన్న పిల్ల‌ల‌తో సినిమా చూసి విజ‌య‌శాంతి గారిని ఈవెనింగ్ క‌లిశాను. ఆ కేర‌క్ట‌ర్‌ను ఆవిడ త‌ప్ప‌, ఇంకెవ‌రూ చేయ‌లేరు. ఇంత‌కు ముందు కూడా ఈ విష‌యాన్ని చెప్పాను.

ఇప్పుడు మ‌ళ్లీ చెబుతున్నాను. ఈ ప్రాజెక్టులో ఆవిడ ప‌నిచేసినందుకు ఆనందంగా ఉంది. నాకు బాగా న‌చ్చిన టెక్నీషియ‌న్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్టార్లు. వాళ్లు ఎప్పుడూ ఆడియ‌న్స్ లాగా ఉంటారు. టెక్నీషియ‌న్లు లాగా ఉండ‌రు. అందుకే అనిల్ రావిపూడిగారిని వాళ్ల‌కు క‌థ చెప్ప‌మ‌ని అడిగాను.

దూకుడు త‌ర్వాత నేను చేసిన సినిమాల‌న్నీ గొప్ప సినిమాలు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు. శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి.. ఇలా! వాటికి ఎక్క‌డో స్క్రిప్ట్ కి స‌రెండ‌ర్ అయిపోవాలి. ఇందాక మాస్ట‌ర్స్ అన్న‌ట్టు నాన్న‌గారి అభిమానులుగానీ, నా అభిమానులుగానీ, జ‌న‌ర‌ల్ ఆడియ‌న్స్ గానీ, మ‌హేష్ బాబును దూకుడులో చూసుకున్న‌ట్టు ఫీల‌య్యార‌ని నాకు అనిపించింది.

అనిల్‌గారు నాకు క‌థ చెప్పిన‌ప్పుడు నేను ఎగ్జ‌యిట్‌మెంట్ ఫీల‌య్యాను. కానీ అప్పుడే చేయ‌డానికి నాకు వేరే క‌మిట్‌మెంట్లు ఉన్నాయి. అందుకే ఒన్ ఇయ‌ర్ త‌ర్వాత చేద్దామ‌ని అన్నా. కానీ ఎఫ్‌2 చూసిన త‌ర్వాత ఆయ‌న చెప్పిన క‌థ‌ను ఇమీడియేట్‌గా చేస్తే బావుంటుంద‌ని అనిపించింది. వెంట‌నే ఆయ‌న‌తో విష‌యం చెప్పాను. ఆయ‌న రెండు నెల‌ల్లో మొత్తం స్క్రిప్ట్ రాసి తెచ్చేశారు.

ర‌ష్మిక సినిమా షూటింగ్ అప్పుడు ఇన్ని మంచి మాట‌లు చెప్ప‌లేదు. పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తే ఇన్ని మంచి మాట‌లు చెప్పింది. నిన్న‌టి నుంచి నేను ఫీల‌యిన ఎగ్జ‌యిట్‌మెంట్‌, జ‌ర్నీ కొత్త‌గా అనిపించింది. నాన్న‌గారి అభిమానులు, నా అభిమానులు చెప్పిన తీరు కొత్త‌గా అనిపించింది. ఆ ఫుల్ క్రెడిట్ అనిల్ రావిపూడికి ఇస్తున్నాను.

ఈ క‌థ చెప్పిన ద‌గ్గ‌రి నుంచీ, షూటింగ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచీ ఇవాళ వ‌చ్చిన రెస్పాన్స్ ను ఆయ‌న ఊహిస్తూనే ఉన్నారు. దేవి నాకు ఇష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుడు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్‌. అందుకే అది దేవి చేతుల్లో ఉందంటే నాకు ఆనందంగా ఉంటుంది. అల్లూరి సీతారామ‌రాజు సీన్ వ‌చ్చిన‌ప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విని నాకు గూస్ బంప్స్ వ‌చ్చాయి.

దానిక‌న్నా మైండ్ బ్లాక్ సాంగ్‌ను కంపోజ్ చేసి, న‌న్ను క‌న్విన్స్ చేశారు.. ఇవాళ దానికి వ‌స్తున్న రియాక్ష‌న్ చాలా బాగా వ‌స్తోంది. నాకు చాలా కొత్త ఎక్స్ పీరియ‌న్స్. నా 20 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి రియాక్ష‌న్ ఎప్పుడూ చూడ‌లేదు. అనిల్ సుంక‌ర‌గారు మా ఇంటిలోని వ్య‌క్తిలాగా. ఆయ‌న‌కు నాన్న‌గారంటే చాలా ఇష్టం.

ఏవ‌న్నా న‌చ్చితే బాడీ లాంగ్వేజ్‌లో చూపిస్తారు. రెండు రోజులుగా ఆయ‌న బాడీ లాంగ్వేజ్‌లో నాకు అది మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దిల్‌రాజుగారితో నాది హ్యాట్రిక్ కాంబినేష‌న్‌. ఆయ‌న‌తో డ‌బుల్ హ్యాట్రిక్ కొడ‌తాం. ఈ సినిమా హిట్ ఇచ్చినందుకు నాన్న‌గారి అభిమానులు, నా అభిమానులు, మా టెక్నీషియ‌న్స్ త‌ర‌ఫున అనిల్ రావిపూడిగారికి హ‌గ్ ఇస్తున్నాను అని అన్నారు.

Share

Leave a Comment