మనసుకు హత్తుకునే..

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ పరిశ్రమ శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. నటశేఖరుని వారసుడు సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ లో మనసుకు హత్తుకునే నోట్ ను పోస్ట్ చేశారు.

నేను ఉన్నంతలో బెస్ట్ గా ప్రతిదీ ప్రయత్నిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా మీకు జీవితాంతం రుణపడి ఉంటానంటూ మై ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అంటూ భావోద్వేగపూరితమైన విషెస్ తో ఆకట్టుకున్నారు. ట్విట్టర్ వేదికగా మహేష్ తన తండ్రితో కలిసి దిగిన ఓ చిన్నానాటి ఫోటోను షేర్ చేసాడు.

నేటి ఉదయం కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ కెరీర్ 27వ మూవీ అధికారికంగా లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీలుక్ కి అద్భుత స్పందన వచ్చింది. సర్కార్ వారీ పాట అనే టైటిల్ ని నేడు ప్రకటించనున్నారన్న సమాచారం ఉంది

ఇక కృష్ణ మనవడు మహేష్ కుమారుడు గౌతమ్ కూడ తన తాత కృష్ణకు చాలా వైరటీగా బర్త్ డే విషేస్ తెలిపాడు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా గౌతమ్ తన తాతతో దిగిన ఓ చక్కని ఫోటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా గౌతమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తాత గారు అని రాసుకున్నాడు.

సితార కూడా కృష్ణకు బర్త్ డే విషేస్ తెలిపింది. కృష్ణ పుట్టినరోజు అంటే ప్రతి ఏడాది అభిమానుల మధ్య ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈసారి అంత సందడి లేదు. గతేడాది ఆయన సతీమణి విజయనిర్మల మరణించడంతో కృష్ణ ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు.

తన తండ్రి పుట్టినరోజు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు మహేష్ బాబు. తన ట్విట్టర్లో తన తర్వాతి సినిమా పోస్టర్ విడుదల చేసాడు. సర్కారు వారి పాట అనే టైటిల్ తో విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ బాబు తన మేడ మీద రూపాయి ముద్ర వేసుకున్నాడు. అలాగే చెవికి ఫోగు తో మహేష్ లుక్ అదిరింది.

మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయని పరశురామ్ చెప్పారు.

ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నానని తెలిపారు. ఇది మంచి సబ్జెక్ట్ అని, అందుకే వదలకుండా దాన్నే పట్టుకున్నానని.. అది తనను వదలకుండా పట్టుకుందని చెప్పారు పరశురామ్. ఇది చాలా మంచి సినిమా అవుతుందని, నవరసాలు ఉంటాయని వివరించారు.

అయితే మహేష్ కొత్త సినిమా అధికారిక లాంచ్ సహా మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ కొత్త సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కి ప్లాన్ చేశారు. పార్లమెంట్ సభ్యుడు ప్రముఖ వ్యాపారవేత్త జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

Share

Leave a Comment