ఆసక్తికర విషయాలు తెలిపిన మహేష్..

తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో బంపర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం మంచి జోరు మీదున్నారు. తర్వాతి సినిమా మహేష్ బాబు మొదలెట్టే లోపు తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడాన్నే మహేష్ బాబు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్ మనకి తెలియని అనేక విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇదివరకే మహేష్ రాజకీయాల్లోకి రానని తెలిపినా ఈ మధ్య కొన్ని వార్తలు జోరుగా వైరల్ అవుతోన్న సందర్భంగా దీని గురించి మహేష్ మళ్లీ మాట్లాడక తప్పలేదు. మీరు ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు సమాధానంగా నేను సీఎం అయితే రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలని పేర్కొన్నారు.

రాజకీయాల గురించి తనకసలు ఏం తెలీదని, నా దృష్టి అంతా కేవలం సినిమాలపైనే ఉందని సమాధానమిచ్చారు. మహేష్ ఇంట్లో ఉన్న నాతోనే సరిగ్గా మాట్లాడరు. ఇక రాజకీయాల్లోకి వచ్చి స్టేజ్‌ ఎక్కి ఏం మాట్లాడతారు ఆయన సతీమణి అని ఆయన సతీమణి నమ్రత చమత్కరించారు.

మహేష్ బాబుకు ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టైల్, ట్రెండ్ ఉన్నాయి. మరి అంతటి స్టార్‌డం సంపాదించుకున్న మహేష్ జీవితంపై ఓ బయోపిక్ వస్తే బాగుంటుంది అని చాలా మంది ఆశిస్తారు. మహేష్ బాబు జీవితంపై బయోపిక్ వస్తుందా? అని ప్రశ్నించగా తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్ అని తనపై బయోపిక్ ఎవరైనా తీసినా ఆ సినిమా హిట్ కాదని నవ్వుతూ జవాబిచ్చారు.

మహేష్ మరో ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. టాలీవుడ్ కు చెందిన ఒక ముగ్గురు నటులతో మీరు కలిసి రోడ్ ట్రిప్ వెళ్లాలని అనుకుంటే ఎవరెవరిని తీసుకొని వెళ్తారు అని అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి అని ఆన్సర్ ఇచ్చారు మహేష్ బాబు.

మూవీ సెట్ లో జరిగిన ఓ ఘటన మీరు ఎప్పుడూ మరచిపోలేని సంఘటన ఏమైనా ఉందా అని ప్రశ్నించగా, 2001 లో మురారీ సినిమా విడుదలైనప్పుడు నేను, నాన్న సుదర్శన్ 35 కు సినిమా చూడడానికి వెళ్లాం. మార్నింగ్ షో చూశాక నాన్న ఎంతో అభిమానంతో నా భుజాల మీద చేతులు వేశాడు. అది ఎప్పటికీ మరచిపోలేను అన్నారు.

మీ జీవితంలో ఓ అభిమాని చేసిన పని ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏంటి అని ప్రశ్నించగా, కొన్నేళ్ల క్రితం ఓ అభిమాని నాకో లెటర్ పంపించాడు. అది ఓపెన్ చేస్తే బ్లడ్ తో నా పేరు రాసి ఉంది. అది ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని తెలిపారు మహేష్ బాబు.

పర్ఫెక్ట్ రొమాంటిక్ డేట్ అంటే మీ ప్లాన్ ఏమిటి, పర్ఫెక్ట్ విహారయాత్ర అంటే మీరు ఏమి చెప్తారు అని ప్రశ్నించగా, భార్యతో కలిసి ఓ మంచి సినిమా చూడడం పర్ఫెక్ట్ రొమాంటిక్ డేట్. నా భార్య పిల్లలతో విహారయాత్ర వెళ్లడమంటే చాలా ఇష్టం. ఒక ప్రాంతం అంటూ లేదు కానీ. అందరూ కలిసి ఉంటే చాలా బాగుంటుంది అన్నారు.

మహేష్ గారు మీ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే, యంగ్ గా ఉన్న మహేష్ బాబుకు మీరు ఏదైనా చెప్పాలని అనుకుంటే అని ప్రశ్నించగా, వినయం, వినయం, వినయం ఇవే మూడు ముక్కలు అంటూ.. యంగ్ మహేష్ బాబు అంటే అది నా కొడుకే సో నీ తండ్రిలా ఉండు అని చెప్తా అని నవ్వుతూ జవాబిచ్చారు మహేష్.

మహేష్‌కు మహర్షి లాంటి బ్యూటిఫుల్ సినిమాను కానుకగా ఇచ్చారు దర్శకుడు వంశీ పైడిపల్లి. అందుకే ఇప్పుడు మరోసారి ఆయనతో సినిమ చేసేందుకు సిద్ధమయ్యారు. మరో నెల రోజులు తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇందులో మహేష్ కారక్టర్ చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారం.

Share

Leave a Comment