స్పెయిన్ లో ఏం చేస్తున్నారంటే

ప్రస్తుతం వెకేషన్స్ సీజన్ నడుస్తోంది. సమ్మర్ కావడంతో.. జనాలంతా విహార యాత్రలు చేస్తున్నారు. సరిహద్దులు దాటి పక్క దేశాలకు షికార్లు కొట్టేస్తున్నారు కూడా. సెలబ్రిటీల విహార యాత్రలు అందరినీ ఆసక్తి కలిగిస్తాయి. ఇలాంటి ఫ్యామిలి టూర్స్ కి వెల్లడం లో మహేష్ బాబుకు మంచి గుర్తింపే ఉంది.

ఏటేటా మాత్రమే కాదు.. అడపాదడపా తనకి షూటింగ్ మధ్యలో కొంత ఫ్రీ టైం దొరికినా కూడా కుటుంబంతో కలిసి విహార యాత్రలకి వెల్తుంటాడు సూపర్ స్టార్..అయితే.. ప్రతీ ఏటా సమ్మర్ లో మాత్రం యూరోప్ టూర్ కచ్చితంగా వెళ్లడం వీరి ఆనవాయితీ.

ఈ సారి కూడా మహేష్ అండ్ ఫ్యామిలీ యూరోప్ వెళ్లారు. అయితే.. ఎప్పుడూ పారిస్ లో ఎక్కువగా ఉండే సూపర్ స్టార్ కుటుంబం.. ఈ సారి ఫ్రాన్స్ లో కొంత సమయం ఉండి ఆ తరువాత స్పెయిన్ లో సమయం గడుపుతున్నారు.. ఈ విషయాన్ని మహేష్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ స్వయంగా చెప్పారు. చెప్పడమే కాదు.. చూపించారు కూడా.

స్పెయిన్ లో టెన్నిస్ కు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఇప్పుడు మహేష్ కూతురు సితార కూడా టెన్నిస్ ప్రాక్టీస్ గ్రౌండ్ లో బాల్ గాళ్ గా వ్యవరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతటి ఎండలో కూడా బోలెడంత సేపు గడిపిందంటే.. ఆమెకు ఈ క్రీడపై ఎంత మక్కువో అర్ధమవుతుంది.

తమ కూతురు సితార బాల్ గాళ్ గా టెన్నిస్ కోర్ట్ లొ ఉన్న ఫోటోలను నెట్ లో షేర్ చేసింది నమ్రతా శిరోద్కర్. అవి కొద్దిసేపట్లోనే విపరీతమైన లైక్స్,షేర్స్ తో వైరల్ గా మారాయి. సితార కి సంబందించి ఏ పిక్స్ వచ్చిన వాటికి అపూర్వమైన స్పందన నెటిజన్స్ నుండి లభిస్తుంది.

అంతే కాదు, తమ కుమారుడు గౌతం కూడా అక్కడ టెన్నిస్ కోర్ట్ లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ని కూడా నమ్రత ఫ్యాన్స్ కోసం షేర్ చేసారు. దీని బట్టీ వీరికి ఈ ఆట మీద ఎంత మక్కువ ఉందో తెలుస్తుంది. కేవలం టెన్నిస్ ఒక్కటే అని కాకుండా మహేష్ ఆండ్ గౌతం కి క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను. ఇప్పటికే ఈ చిత్రం అన్ని ఏరియాల్లో సూపర్ హిట్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటన, కొరటాల మార్క్ మేకింగ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం రూ.200కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుని ఇంకా స్టడీగానే సాగుతోంది.

Share

Leave a Comment