ప్యారిస్‌కి సూపర్‌స్టార్

అటు సినిమాలు, ఇటు యాడ్స్ అంటూ బిజీ బిజీగా గడిపే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తూంటారు. అలాగే ఇఫ్పుడు మహర్షి చిత్రం షూటింగ్ పూర్తి అవ్వడంతో ఆయన కుటుంబాన్ని తీసుకుని ప్యారిస్ వెలుతున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా నమ్రత గారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులాకు తెలియజేసారు. తాను, మహేష్ తో పాటు వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ జేవివియర్ దంపతులతో ఉన్న ఫొటోను తన ఖాతా లో పోస్ట్ చేసారు నమ్రత. సూపర్ స్టార్ సూపర్ చిల్డ్ అవుట్ గా ఉన్నారు ఈ ఫొటోలో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అవుతుంది.

మహర్షి చిత్రం షూటింగ్ పూర్తయ్యాక విడుదలకు ముందు మహేష్ తీరిక పడ్డాడు. దీనితో మహెష్ కు ఫ్యామిలీతో గడిపే అవకాశం వచ్చింది. కేవలం కెరీర్ కాకుండా కుటుంబం కూడా తనకు చాలా ముఖ్యమని ఎపుడూ చెప్పే ఈ టాలీవుడ్ ప్రిన్స్ పిల్లా పాపలతో ఈ వేసవి సెలవులను ప్యారిస్ లో ఎంజాయ్ చేయబోతున్నారు అనమాట.

టాలీవుడ్‌లోనే బెస్ట్ ఫ్యామిలీమేన్‌గా కితాబు అందుకున్నాడు మ‌హేష్‌. ఇల్లు, షూటింగ్ త‌ప్ప వేరొక ప్ర‌పంచం ప‌ట్ట‌ని వాడిగా మ‌హేష్ అంద‌రికీ తెలుసు. ఖాళీ స‌మ‌యాల్లో గౌత‌మ్‌, సితార‌ల‌తో క‌లిసి ఆటా పాట‌ల్లో మునిగి తేల్తుంటారు. అంతేకాదు ప్ర‌తిసారీ త‌న సినిమాల షూటింగులు పూర్త‌యిన వెంట‌నే ఫారిన్‌కి జాలీ ట్రిప్‌కి వెళుతుంటారు.

న‌మ్ర‌త‌, గౌత‌మ్‌,సితార‌ల‌తో పాటు విదేశీ సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటారు. బ్యాంకాక్‌, ప‌టాయా, లండ‌న్ వంటి చోట్ల ఇది వ‌ర‌కూ ఫ్యామిలీ ట్రిప్‌లు ఆస్వాధించారు. ఈసారి హంస సొగ‌సుల ప్యారిస్ న‌గ‌రానికి మ‌హేష్ కుటుంబ స‌మేతంగా ప‌య‌నిస్తున్నారు. ఇప్ప‌టికే `భ‌ర‌త్ అనే నేను` సినిమా పూర్తి అయిన తరువాత మహేష్ కుటుంబ సమేతంగా పారిస్ వెళ్ళివచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ట్రిప్ వారం పాటు సాగుతుందా లేదూ తొందరగానే ముగుస్తుందా అన్న‌ది మాత్రం తెలియరాలేదింకా. ఎందుకంటే మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, పబ్లిసిటీ అని చాలా పనులు ఉన్నాయి మహేష్ కి. వచ్చే నెల 9న రిలీజ‌వుతున్న `మహర్షి` విజ‌యంపై మ‌హేష్ ప‌క్కాగా ధీమాను క‌న‌బ‌రుస్తున్నార‌ని ఈ జాలీ ట్రిప్ చెబుతోంది.

ఈ సందర్భంగా మహేష్ కుటుంబ సమేతంగా ఇది వరకు వెళ్ళిన పారిస్ ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలు మీకోసం.

1)

2)

3)

4)

5)

6)

7)

8)

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ సినిమా ‘మ‌హ‌ర్షి’. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తున్న‌ ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మ‌హేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

చిత్రాన్ని మే 9 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో మహర్షి మీద ఉన్న అంచానాలు మరే ఇతర సినిమాలపై లేవు. అందరి దృష్టి మహేష్ సినిమాపై ఉంది. మహేష్ రేంజ్ స్టార్ హీరో సినిమా లేక డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు మహేష్ కొత్త ఊపిరి ఇవ్వడం ఖాయమని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది.

Share

Leave a Comment