అదిరిందిగా..!!

మహేష్ బాబు వృత్తిపరంగా ఎంత నిబద్దతో ఉంటాడో ఫ్యామిలీ విషయంలోనూ అంతే పర్ఫెక్ట్ గా ఉంటాడు. షూటింగ్స్ తో అలిసిసొలసి తన పిల్లలకి స్కూల్ సెలవులు రాగానే భార్యతో కలిసి విదేశాలకు వెళ్ళే మహేష్ బాబు ఫ్యామిలీ ఎటాచ్‌మెంట్ గురించి ఎప్పుడూ మనం అందరం మాట్లాడుకుంటూనే ఉంటాం.

మహేష్ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ చూసి చాలామంది హీరోలు ఇన్స్పైర్ అవుతుంటారు. ఇక ఎప్పుడూ వెకేషన్స్ ని ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేసే మహేష్ ఈ సారి దసరా హాలిడేస్ కి స్విజ్జర్లాండ్ లో ల్యాండ్ అయ్యాడు. నమ్రత – గౌతమ్ కృష్ణ సితారాలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్ ఫుల్ గా ఎంజాయ్ చేసాడు మహేష్.

ఆ ఎంజాయ్మెంట్ ని మాటలలో వర్ణించడం ఎందుకులే అనుకున్నాడేమో ఓ క్యూట్ ఫ్యామిలీ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను హ్యాపీ చేసాడు మహేష్ బాబు. వోగ్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోజు ఒక ఎత్తైతే… తాజాగా ఫ్యామిలీతో ఇచ్చిన క్యూట్ అండ్ స్టైలిష్ లుక్ మరో ఎత్తు.

మహేష్ బాబు చైర్ లో స్టైలిష్ గా కూర్చుంటే గౌతమ్ ఆ కుర్చీ అంచు మీద తల్లి నమ్రతని అనుకుని కూర్చున్నాడు. ఇక క్యూట్ సితార పాప మహేష్ ఒడిలో స్టైలిష్ లుక్ అండ్ స్మైల్ తో కూర్చుంటే నమ్రత మాత్రం సింపుల్ గా భర్త వెనకాల నిల్చుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ ఇంట్రెన్ట్ లో తెగ వైరల్ అయ్యింది.

మహేష్ మాత్రం మునుపటి కంటే చాలా యుంగ్ లుక్ లో అందంగా, సూటేసుకుని చాలా రాయల్ గా కనిపిస్తున్నాడు. ఇది చూసి అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు. ఇక వారు నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ దిగిన ఆ ఫోటోపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంతో “అదిరిందిగా” అంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

దసరా సెలవుల సందర్భంగా పిల్లలు గౌతమ్‌, సితార, భార్య నమ్రతతో కలిసి స్విట్జర్లాండ్ లో అందమైన పూదోటల మధ్య పర్వత శ్రేణుల నడుమ ఉండే ఓ విలాసవంతమైన చోటులో మహేష్ సేద తీరుతున్నాడు.ఈ ట్రిప్ ముగిశాక.. మళ్లీ సరిలేరు నీకెవ్వరు పెండింగ్ చిత్రీకరణలో పాల్గొంటారు.

తాజాగా దసరా పండుగను సందర్భంగా సరిలేరు నీకెవ్వరు టీం ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టి చెడు ని వేటాడుతున్న డైనమిక్ హీరో లా కనిపిస్తున్నాడు మహేష్. ఈ మాస్ పోస్టర్ కి విశేషమైన స్పందన లభించింది. ఇలాంటి మాస్ యాక్షన్ సన్నివేసాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఓ వైపు అనీల్ రావిపూడి రెట్టించిన ఉత్సాహంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో తొలిసారి ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు అనిల్. రష్మిక కథానాయిక. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు పక్కా సంక్రాంతి పండుగ సినిమా. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే విజయశాంతి గారికి కూడా మంచి రోల్ ఉంది. ఈ సినిమా ఆమెకు పర్‌ఫెక్ట్ రీలాంచ్ లా ఉంటుంది. గత కొన్ని సినిమాలలో మహేష్ నుంచి ఏమి మిస్ అవుతున్నారో అవన్నీ ఉంటాయని నిర్మాత అనిల్ సుంకర తెలియజేసారు.

ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ కాకుండా మహేష్ రేంజ్ కి సరిపోయే మాస్ అంశాలు కూడా మిళితం చేసి ఓవరాల్ గా ఈ సినిమాను ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు అనిల్. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు నెలకొల్పనుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Share

Leave a Comment