కామెంట్స్, లైక్స్ వెల్లువలా వస్తున్నాయి…

 

సోషల్ మీడియాలో ఖాతాలు ఉన్న మాటకే కాని, ఎప్పుడో సినిమాల రిలీజ్ టైంలో తప్ప పెద్దగా స్పందించని మహేష్ బాబు సంగతులను, సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలుపుతుంటుంది.

నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె.. మహేష్ మూవీ షూటింగ్స్, పర్సనల్ అప్‌డేట్స్ అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

పిల్లలు గౌతమ్, సితారలతో వెళ్ళిన ఫ్యామిలీ ట్రిప్ లు తదితర ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ప్రిన్స్ ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లో ఉంచుతుంది.

మహేష్ బాబు కూతురు సితారకు సంబంధించి సోషల్ మీడియాలో ఏ ఫొటో కనిపించినా.. వీడియో కనిపించినా అవి వైరల్ అయిపోతాయి.

నమ్రత, తాజాగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి కామెంట్స్, లైక్స్ వెల్లువలా వస్తున్నాయి.

గౌతమ్, సితారలు కలిసి మహేష్ చేయి పట్టుకుని తీసుకువెళ్తున్న ఫోటోను బ్యాక్ యాంగిల్ నుండి తీసి నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

అయితే ఈ ఫోటోలో మహేష్ తో సహా ఏ ఒక్కరి ముఖాలు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో మరిన్ని మహేష్ బాబు ఫోటో లను  షేర్ చేయండి మేడం అంటూ నమ్రతను అడగడం అభిమానుల వంతవుతోంది.

అయితే హీరోయిన్లు సమంత, కైరా అద్వానీ వంటి ప్రముఖులు లైక్స్ కొట్టేసారు. ఈ ఫోటో వైరల్ అవుతుంది.

బహుశా క్రిస్మస్ వేడుకలకు గౌతమ్ – సితారలు కలిసి మహేష్ బాబును తీసుకువెళ్తున్నట్లుగా ఈ ఫోటోలో భావం కనపడుతుందేమో…

అందుకే తక్కువ టైంలోనే లైక్స్ బాగా వచ్చి పడుతున్నాయి.

తాజాగా సితారకు సంబంధించిన ఒక ఫొటో ఇలాగే వైరల్ అవుతోంది.  ఈ ఫొటోను  అభిమానులు షేర్ల మీద షేర్లు చేసుకుంటున్నారు.

మహేష్ కు తన కొడుకు కూతురు అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పిల్లలు పుట్టాక అతడిలో చాలా మార్పు వచ్చింది.

వాళ్లతో కలిసి తరచుగా వెకేషన్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటాడు ప్రిన్స్. వాళ్లు తన స్ట్రెస్ బస్టర్స్ అని మహేష్ చెబుతుంటాడు.

మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలోనూ కొరటాల ఓ ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ని ఎత్తుకోనున్నాడనీ తెలుస్తోంది.

అది కూడా సామాజికంగా ఎక్కువ ప్రభావితం చూపించేదే అవుతుందట. ఈ సినిమాలో మహేష్‌బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులు, సమాజంలో తలెత్తుతున్న అనేక అరాచకాలపై హీరో ఫైట్‌ చేస్తాడనే సమాచారమ్‌ చిత్ర సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది. అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.

Share

Leave a Comment