సూపర్‌స్టార్ ఫ్యామిలీ హ్యాపీగా

సందేశాత్మక చిత్రాలతో వరుస హిట్లు కొట్టి అభిమానులను అలరిస్తున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. అయితే కెరీర్‌ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి టైం కేటాయించడంలోనూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి కాస్త విరామం దొరికితే చాలు భార్య, పిల్లలతో కలిసి హాలిడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తారు.

ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యామిలీని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తోంది. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కాస్త టైం దొరకినా మహేష్ ఆనందంగా గడుపుతారు. అంతే కాదు అందుకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి అభిమానులకు అందిస్తూ ఉంటారు. అలాంటి మహేష్ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి నటిస్తే ఎలా ఉంటుంది.

ఓ ప్రకటనలో మహేష్ ప్యామిలీ అంతా కలిసి యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ప్రచార ప్రకటనల్లోనూ మహేష్‌ అగ్ర స్థానంలో ఉన్నారు. వరుస కమర్షియల్‌ యాడ్స్‌తో దూసుకుపోతున్నారు. మహేష్‌బాబుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్‌ అలాంటిది మరి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఏకంగా సూపర్‌స్టార్‌ ఫ్యామిలితో ఓ యాడ్‌ను రూపొందించింది.

ఇందులో మహేష్‌తో పాటు నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలు కూడా నటించారు. ఈ కమర్షియల్ ను దీపావళి పండుగ సందర్భంగా స్వయంగా మహేష్ అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యాడ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసారు. ఆ వీడియోను మీరు కూడా ఒక సారి చూసెయ్యండి.

గౌతమ్ పెద్ద వాడు అవ్వడంతో పాటు సితార కూడా చాలా క్యూట్ గా ఈ యాడ్ లో కనిపించింది. ఇక మహేష్ బాబు ఎప్పటి లానే స్టైలిష్ మ్యాన్లీ లుక్ తో ఫిదా చేసేసారు. చాలా కాలం తర్వాత నమ్రత ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించడం జరిగింది. మొత్తానికి ఈ యాడ్ సినీ ప్రేక్షకులకు మాత్రం ఫుల్ హ్యాపీని తెచ్చింది.

1)

2)

3)

4)

5)

కాగా మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ, రాబోయే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కేరళ లో జరుగుతుంది. కేరళలో షూటింగ్ సందర్భంగా యూనిట్ సభ్యులంతా ఒక్కచోట చేరి సందడి చేశారు.

ఈఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొలిసారి మహేష్ మిలటరీ నేపథ్యంలో సాగే కథని ఎంచుకున్నారు. చాలా కాలం తరవాత విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భరత్ అనే నేను, మహర్షి సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా గురించి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ఎదురు చూస్తుంది. మహేష్ కు తోడు భారీ తారగణం, దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ రేట్ ఇలా అన్ని అంశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి.

Share

Leave a Comment