గెట్ సెట్ గో..

ఎంత పెద్ద హీరోలైనా వయస్సు పెరిగేకొద్ది వారి మొహం లో ఆ మార్పు కనిపిస్తూ ఉంటుంది. కానీ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ బాబు ఏజ్ మాత్రం రివ‌ర్స్ గేర్‌లో వెళుతుంద‌ని అనిపిస్తోంది. ఇందుకు ఆయ‌న తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోనే నిద‌ర్శ‌నం

కొడుకు గౌత‌మ్‌, కూతురు సితార‌తో క‌లిసి విమానాశ్ర‌యంలో క‌నిపించిన‌ మ‌హేశ్‌, వారికి తండ్రిలా కాకుండా సోద‌రుడిలా క‌నిపించ‌డం విశేషం. క‌రోనాను దృష్టిలో పెట్టుకుని జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే మ‌హేశ్ కుటుంబంతో క‌లిసి వెళ్తున్నారు

అందులో భాగంగా మ‌హేశ్ కుటుంబం అంతా ఫేస్ మాస్కులు ధ‌రించి ఎయిర్‌పోర్ట్‌లో ద‌ర్శ‌నమిచ్చారు. కుటుంబం అంతా ఇలా మాస్కులు ధరించి అభిమానులకి మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ సైతం పిల్ల‌ల‌తో క‌లిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు

మ‌హేష్ ఎయిర్ పోర్ట్‌లో త‌న పిల్ల‌తో క‌లిసి తీసుకున్న సెల్ఫీ వైర‌ల్‌గా మారింది. కొత్త సాధారణ ప‌రిస్థితుల‌ను అలవాటు చేసుకోవడం, సురక్షితమైన విమానానికి అంతా సన్నద్ధమయ్యాయి. జీవితం మ‌ళ్లీ ట్రాక్ ఎక్కింది. గెట్ సెట్ గో అని మ‌హేష్ ట్వీట్ చేశారు

కాగా క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల ఈ సూప‌ర్ స్టార్ కుటుంబం ఎనిమిది నెల‌లుగా బ‌య‌ట ప్ర‌దేశాల‌కు వెళ్ల‌కుండా ఇంటికే ప‌రిమిత‌మైంది. మ‌రోవైపు త్వ‌ర‌లోనే స‌ర్కారు వారి పాట సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది

ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమా తో సూపర్ హిట్ ని సాధించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక ప్రస్తుతం గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తిసురేష్ నటిస్తోంది

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

మహేష్ పరుశురామ్ సర్కారు వారి పాట సినిమా తొందరగా కంప్లీట్ చేయడానికి పక్కా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారట. కరోనా ఎఫెక్ట్ షూటింగులు వాయిదా పడ్డాయి. అయితే ఈలోగా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసేద్దాం అని దర్శకుడు పరశురామ్ చెప్పినట్లు సమాచారం

Share

Leave a Comment