మహేష్ న్యూ ఇయర్ ట్రిప్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన కెరీరి ను ఎలా కొనసాగించినా కూడా ఒక ఫ్యామిలీ పర్సన్ గా మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే.

పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఫ్యామిలీని ఏ మాత్రం మిస్ కాకుండా వారితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు.

స్పైడర్ రిలీజ్ అయిన తరువాత మహేష్ కొన్ని నెలల విదేశాల్లో గడిపివచ్చాడు. ఇక ప్రస్తుతం భరత్ అనే నేను సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.

అయితే చాలా రోజుల నుండి షూటింగ్ లతో బిజీగా ఉండడంతో మహేష్ మళ్లీ కొంచెం బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో క్రిస్మస్ – న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని జరుపుకోవాలని అననుకుంటున్నాడట.

అందుకోసం త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నాడట. అందమైన ప్రదేశాలను ఫ్యామిలీతో కలిసి గడిపి రావాలని మహేష్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది కూడా విదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకున్న మహేష్ .. ఇప్పుడు కూడా అటే వెళ్తున్నాడనమాట.

అయితే ఎప్పటిలాగానే ముందు దాబాయ్ / అబు దాబిలలో ఉండి. తరువాత ఏదన్నా యురోప్ కంట్రీ వెళ్తారా? చూడాలి.

గత యేడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లాడు మహేష్ బాబు. ఈ సారి లండన్ వెల్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా క్రిస్మస్, న్యు ఇయర్ ని విదేశాల్లోనే సెల్ బ్రేట్ చేసుకోబోతోంది మహేష్ బాబు ఫ్యామిలీ..!

ఇకపోతే ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా దాదాపు సగానికి పైగా పూర్తయ్యింది. తమిళనాడులో కొన్ని యాక్షన్స్ సీన్స్ ని దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్నాడు.

ఆ షెడ్యూల్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని మళ్లీ జనవరి సెకండ్ వీక్ లో నెక్స్ట్ షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది.

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతోన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అన్న విషయాన్ని ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌ లో సినిమా రిలీజ్‌ అనుకుంటున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ కథానాయిక.

‘భరత్‌ అనే నేను’ సినిమా రూపకల్పన పూర్తి కాకముందే అన్ని ప్రాంతాల్లో భారీ ధరలకు అమ్ముడవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌ హక్కులు చాలా పెద్ద మొత్తానికి అమ్ముడయ్యాయి.

ఫ్యాన్సీ రేటుకు లహరి మ్యూజిక్ కంపెనీ హక్కులను సొంతం చేసుకుందట. ప్రిన్స్ కు కొరటాల.. మరో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.

Share

Leave a Comment