మహేష్ బాబు సూపర్ స్టార్ హీరోనే కాదు బాధ్యత గల తండ్రి కూడా. అందుకే తన పిల్లలను తీసుకుని ప్రతి ఏడాది సెలవులకు ఏదో ఒక దేశానికి ఎగిరిపోతుంటాడు. లేదా చేసిన సినిమా విడుదలయ్యాక కూడా కాస్త రిలాక్స్ అయ్యేందుకు ఫ్యామిలీతో కలిసి అలా కొన్ని రోజులు విదేశాలలో సేదతీరి వస్తుంటాడు.
గతంలో ఇలా చాలా సార్లు వెళ్లాడు. తాజాగా భరత్ సినిమా విడుదల తరువాత భార్యా పిల్లలతో కలిసి పారిస్ వీధుల్లో విహరిస్తున్నాడు. పిల్లలతో ఇలా క్వాలిటీ సమయాన్ని గడపడం లో ఎల్లప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు ముందు వరుస లోనే ఉంటాడు.
భరత్ అను నేను సినిమా ఊహించినట్టుగానే మహేష్ ఖాతాలో మరో హిట్ ను జతచేర్చింది. ఆ సినిమా షూటింగ్ మొదలైనప్పట్నించి విడుదలై హిట్ టాక్ వచ్చేదాకా చిత్రయూనిట్ కాస్త టెన్షన్ పడుతూనే ఉంది. ఎప్పుడైతే హిట్ టాక్ వచ్చిందో అంతా రిలాక్సయ్యారు. మొన్ననే సక్సెస్ మీట్ కూడా పూర్తి చేసుకున్నారు.
ఇక మిగిలింది కుటుంబంతో ఎంజాయ్ చేయడమే. ఆ విషయంలో మహేష్ బాబు ముందుంటాడు. అందుకే భార్య నమ్రతా పిల్లలు సితార గౌతమ్‌లతో కలిసి పారిస్ టూర్ కు వెళ్లాడు. నమత్రా శిరోద్కర్ ఆ టూర్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఒక ఫోటోలో మహేష్ బాబు కూతురు సితారతో కలిసి లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు.
మరొక ఫోటోలో ఇద్దరు పిల్లలతో కలిసి సామాన్య వ్యక్తిలో పారిస్ వీధుల్లో షికారు చేస్తున్నాడు. ఈఫిల్ టవర్ దగ్గర తీయించుకున్న ఫోటోలను కూడా నమ్రతా షేర్ చేసింది. మహేష్ ఇప్పుడే కాదు గతంలో కూడా కుటుంబంతో కలిసి పారిస్‌కు వెళ్లాడు.
ఈ సారి పిల్లలకి వేసవి సెలవలు కావడంతో ప్యారిస్ లో ఆహ్లాదకరంగా సమయం గడుపుతున్న ఫోటోలను చూసిన మహేష్ అభిమానులు ఎంతగానో సంతోష పడుతున్నారు. నమత్రా ఎక్కువగా పిల్లల ఫోటోలే పోస్టు చేసింది. తమ అభిమాన హీరో ఫోటోలను కూడా పోస్టు చేయమంటూ ఫ్యాన్స్ నమ్రతను కోరుతున్నారు.
పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న మహేష్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొత్తానికి భరత్ అనే నేను సక్సెస్‌ని మహేష్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడనే విషయం ఈ ఫోటోలని చూస్తుంటే అర్ధమవుతుంది. మే రెండో వారం మహేష్ ఇండియాకి రానున్నాడని తెలుస్తుంది. త్వరలో వంశీ పైడిపల్లి సినిమా టీంతో జాయిన్ కానున్నాడు మహేష్.