ఎంతో అమేజింగ్ గా..

మహేష్ ప్రస్తుతం కుటుంబంతో టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొద్దిరోజులలో సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీనితో మహేష్ ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. గౌతమ్, సితార మరియు భార్య నమ్రతతో ఎయిర్ పోర్ట్ కి వచ్చిన మహేష్ కెమెరా కంటికి చిక్కడం జరిగింది

అలాగే పిల్లలతో సెల్ఫీ దిగిన మహేష్, అది ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి టూర్ కి వెళుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. పిల్లల విషయంలో మహేష్ ఎలా ఆలోచిస్తారో ఆయన పోస్ట్ చేసే ఫొటోలను చూస్తే అందరికీ చాలా ఈజీగా అర్ధమవుతుంది

ఎయిర్ పోర్ట్ దగ్గరి నుంచే మహేష్ తన కొడుకు కూతురితో ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఓ రెస్టారంట్ లో ఫుడ్ తింటున్న గౌతమ్ ని మహేష్ హగ్ చేసుకుంటున్న ఫోటో అమేజింగ్ గా ఉంది. వెంటనే వైరల్ అయింది

ఆ ఫొటోకు మహేష్ ఇప్పుడు గౌతమ్ ని హగ్ చేసుకోవడం చాలా చాలా కష్టం అంటూ ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి సరైన సమయం కారణం కూడా అవసరం లేదని మహేష్ ట్వీట్ చేశాడు. పిల్లలను ఫ్రెండ్స్ లా ట్రీట్ చేసే మహేష్ వాళ్ళతో గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు

ఈ సందర్భంగా ఫారెన్‌ టూర్‌లో భాగంగా తన తోడల్లుడు నమ్రత శిరోద్కర్ అక్క శిల్పా శిరోద్కర్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా శిల్పా శిరోద్కర్ భర్త అప్రేశ్ రంజిత్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అప్రేశ్ రంజిత్ కేక్ కట్ చేసే సందర్భంగా మహేష్ బాబుతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బర్త్ డే విషెస్ తెలియజేసారు

తన సోదరి శిల్పా శిరోద్కర్ భర్త అప్రేశ్ రంజన్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన వీడియోను నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పని లేదా పిల్లలు అన్నట్లు ఉంటుంది మహేష్ లైఫ్. ఏమాత్రం షూటింగ్స్ కి విరామం దొరికినా మహేష్ తన సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తారు

ప్రతి సినిమా షూటింగ్ కి ముందు విడుదల తరువాత ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లడం, మహేష్ కి ఆనవాయితీగా ఉంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్, సర్కారు వారి పాట మూవీలో నటించనున్నారు

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా సర్కారు వారి పాట చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించనున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా లేకపోతే ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ సగం కంప్లీట్ కూడా అయిపోయేది.

Share

Leave a Comment