అదరగొట్టిన స్టార్ క్రికెటర్..!

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ గురించి ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. క్రికెట్ గురించి తెలిసిన వారందరికి ఈ పేరు సుపరిచరతమే ఈయన. వీరబాదుడుకు స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే జోష్‌ను టిక్‌ టాక్‌లో కూడా కనబరుస్తున్నాడు వార్నర్‌.

ఇటీవలే టిక్ టాక్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. మొన్నామధ్య ఒక తెలుగు హిట్ సాంగ్ కి తన భార్యతో కలిసి డ్యాన్సులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచిన వార్నర్ ఇప్పుడు డైలాగ్ లతో కూడా ఆకట్టుకుంటున్నాడు. అదిరిపోయే డైలాగ్ చెప్పి అందరినీ అశ్చర్యపరిచాడు.

అదీ మన టాలివుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫేమస్ డైలాగ్ నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన ఈ డైలాగ్‌ ను వార్నర్ తన శైలిలో చెప్పిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు.

పైగా గెస్ ద మూవీ అని నెటిజన్లకు ఛాలెంజ్ కూడా చేశాడు. అయినా తెలుగునాట ఈ డైలాగ్ తెలియని వారు ఎవరు ఉంటారు. మహేష్ పోకిరీ ఎంత చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వార్నర్ సైతం ఈ డైలాగ్ చెప్పడం తో దీనికి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చెసుకోవచ్చు.

అయితే వార్నర్ కి పూరి ట్విట్టర్ లో రీట్వీట్ చేస్తూ డేవిడ్‌ ఇది మీరు. మీ ఆవేశానికి మీ పట్టుదల అండ్ దూకుడుకు ఈ డైలాగ్ మీకు కరెక్ట్ గా సరిపోతుంది. మీరు నటుడిగా కూడా అద్భుతంగా ఉన్నారు మీరు నా చిత్రంలో అతిధి పాత్ర చేస్తారని ఆశిస్తున్నాను అంటూ పూరి పోస్ట్ చేశాడు.

దానికి వార్నర్ ట్వీట్ చేస్తూ ప్రయత్నిస్తాను సర్, అయితే సన్‌ రైజర్స్ విడుదల చేసేవాటిని మీరు చూడవలసి ఉంటుంది అంటూ వార్నర్ పూరికి రీట్వీట్ చేశాడు. పూరి జగన్నాధ్ ట్రేడ్ మార్క్ డైలాగ్స్, మహీష్ బాబు మార్క్ మేనరిజం ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ పోకిరి సినిమా.

మహీష్ కి ఒక కొత్త స్టార్ డం తీసుకొచ్చింది ఈ సినిమా. పోకిరి తోనే ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మారిపోయారు మహీష్ బాబు. పండుగాడు గా మాస్ రోల్ లో మహేష్ వెండితెరపై వీర విజృంభణ చేశాడు. ఇందులో మహేష్ మ్యానరిజం నుంచి డైలాగ్స్ వరకు అన్నీ కూడా జనాలకు బాగా కనెక్టయ్యాయి.

అటు మాస్ ఇటు క్లాస్ అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ ని ఒక ఊపు ఊపేసిన చిత్రం పోకిరి. పోకిరి బ్లాక్ టికెట్స్ అమ్ముకుని లక్షాదికారులు అయినట్టు కూడా ఆ రోజుల్లొ టాక్ ఆఫ్ థి టౌన్. మహేష్ పోకిరి షర్ట్స్ అన్ని అప్పట్లొ ఫ్యాషన్ గా మారిపోయాయి. ఎప్పుడైనా పండుగాడు టీవీలో కనిపిస్తే ఛానల్ మార్చబుద్ధేయదు.

ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు కెప్టెన్‌ గా ఉన్న వార్నర్‌ తెలుగు సినిమాల పై ఇలా ఇంట్రస్ట్ చూపించడం బాగుంది. లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఈ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్. కుటుంబంతో కలిసి ఇలా సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు.

Share

Leave a Comment