ఫ్యాన్స్‌కు సూపర్ సర్‌ప్రైజ్

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్‌ బాబు తన 25వ సినిమా షూటింగులో బిజీగా వున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను, దర్శకుడు వంశీ పైడిపల్లి అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ అక్కడ ఈ షెడ్యూల్ కొనసాగుతుంది.

ఈ సినిమాలో మహేష్‌ జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా, మహేష్‌ ప్రాణ స్నేహితుడిగా ‘అల్లరి’ నరేశ్ కనిపించనున్నారు. సంక్రాంతి బరిలోకి ఈ మూవీ దిగే ఛాన్స్ ఉందనే వార్తలు కొన్ని రోజులుగా షికారు చేస్తున్నాయి. ఆ పుకార్లకు తెరదించేస్తూ, ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు.

వేసవి సెలవుల్లో రానున్న ఈ సినిమాతో మహేష్‌ కి మరో ఘన విజయం దక్కడం ఖాయమనేది ట్రేడ్ పండితుల మాట. విడుదల తేదీని ఏ ఆర్భాటం లేకుండా సడెన్ గా ప్రకటించడంతో సూపర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అప్పుడే విడుదల తేదీని ట్విటర్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్ చేసేస్తున్నారు.

అసలే మహేష్ 25వ సినిమా. సెంటిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలాగైనా దీన్ని ల్యాండ్ మార్క్ మూవీగా మలిచే ప్రయత్నంలో డెడ్ లైన్ పెట్టుకుని తొందరపడకుండా నెమ్మదిగా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారట. ఏప్రిల్ 5కు మరో విశేషం ఉంది. ఉగాది పర్వదినం ముందు రోజు అది.

అంటే ఒకరోజు ముందే అభిమానులకు పండగ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల అంశాలతో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుందట. భరత్ అనే నేను తర్వాత దేవి శ్రీ ప్రసాద్ మరోసారి మహేష్ కు స్వరాలు సమకూరుస్తున్నారు. దిల్ రాజు, అశ్విన్ దత్ నిర్మాణ సంస్థల కాంబో కాబట్టి ప్రొడక్షన్ గురించి చెప్పాల్సిన పని ఉండదు .

ప్రస్తుతం షూటింగ్ ప్రఖ్యాత ఎడ్యుకేషన్ ఇంస్టిట్యూషన్ అయిన ఫారెస్ట్ రిసెర్చ్ ఇంస్టిట్యూట్ లో జరుగుతుంది. దీనినే ఐఐటి గా సినిమాలో చూపించనున్నారని సమాచారం. ఈ షూటింగ్ ఈనెల 10 వ తేదీ వరకు అక్కడే జరగనుంది. ఈ వారంలో సాంగ్ షూట్ కూడా పూర్తి చేయనున్నారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం మూవీ టీమ్‌ యూఎస్‌ వెళ్తారట.

Share

Leave a Comment