మరో ఆల్ టైం రికార్డు బ్రేక్..

సోషల్ మీడియా లో ఈ లాక్ డౌన్ టైం నుండి అందరు హీరోల ఫ్యాన్స్ మరో లెవల్ అనే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ పాత ట్విట్టర్ రికార్డుల బెండు తీస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. కొత్త సినిమా లు ఏవి లేక పోవడం తో ప్రతీ ట్రెండ్ లో కూడా పాత రికార్డులు బ్రేక్ అవుతూ కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.

లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డు తో ఊచకోత కోశారు. ఏకంగా ఇండియన్ రికార్డులు బ్రేక్ చేస్తూ 24 గంటల్లో ఏకంగా 31.1 మిలియన్ ట్వీట్స్ ని పోల్ చేసి దుమ్ము దుమారం చేసే రికార్డులు సొంతం చేసుకున్నారు.

ఈ క్రమం లో టాలీవుడ్ లో టైటిల్ ట్రెండ్స్ విషయం లో కూడా కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. ఫస్ట్ లుక్ లేదా టైటిల్ అనౌన్స్ మెంట్ సమయంలో చేసే ట్రెండ్ లా కాకుండా ఇతర ట్రెండ్స్ లో కూడా టైటిల్స్ ని ఇన్వాల్వ్ చేస్తూ ఈ ట్రెండ్స్ చేస్తున్నారు ఈ మధ్య.

అందులో భాగంగా ఇది వరకు 10.9 మిలియన్ ట్వీట్స్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం వకీల్ సాబ్ పై 24 గంటల్లో పడి కొత్త రికార్డులు నమోదు అయ్యేలా చేసింది. కాగా ఇప్పుడు ఆ రికార్డును డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేశారు మహేష్ ఫ్యాన్స్.

ఎవ్వరూ ఊహించని రేంజ్ లో 24 గంటల్లో ఒక్క సర్కారు వారి పాట హాష్ టాగ్ పైనే ఏకంగా 21.7 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యి ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. దాంతో టైటిల్ ట్రెండ్స్ ఓవరాల్ గా బిగ్గెస్ట్ టార్గెట్ ని అప్ కమింగ్ ట్రెండ్స్ కి సెట్ చేసింది.

ముందుగా అసలు సిసలు అడ్వాన్స్ బర్త్ డే CDP ట్రెండ్ విషయం లో పాత రికార్డులను కేవలం 3 గంటల 37 నిమిషాల్లోనే బ్రేక్ చేసిన మహేష్ ఫ్యాన్స్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి CDP ట్రెండ్స్ లో ఎవ్వరూ అందుకోలేని బెంచ్ మార్క్ ని ప్రస్తుతం సెట్ చేసి పెట్టారు.

జెట్ స్పీడ్ తో దూసుకు పోతూ పాత రికార్డులు ఒక్కోటి బ్రేక్ చేస్తూ దూసుకు పోయారు. 3 కోట్లకు పైగా ట్వీట్లతో ఇండియా ట్విట్టర్‌ చరిత్రలోనే ఇప్పటి వరకు లేని బిగ్గెస్ట్ ట్రెండ్‌ను మహేష్ బాబు అభిమానులు సృష్టించారు. ఈ ట్రెండ్ కేవలం మహేష్ బాబు బర్త్‌డే కామన్ డిస్ప్లే పిక్ కోసమే.

ఇక మహేష్ బాబు బర్త్‌డే (ఆగస్టు 9న) రోజున ఈ ట్వీట్ల రికార్డు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో 31 మిలియన్ ట్వీట్లు చేశారు మహేష్ బాబు అభిమానులు. ఇండియన్ ట్విట్టర్ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పారు.

ప్రస్తుతం మహేష్ 27వ సినిమా త్వరలో సెట్స్ కి వెల్లనుంది. ఈ చిత్రంలో విభిన్నమైన లుక్స్ లో మహేష్ కనిపిస్తాడట. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు.

Share

Leave a Comment