ఊపేస్తున్న ‘భరత్ అనే నేను’ రెండో పాట!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ రెండో పాట ఈ ఉదయం 10 గంటలకు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల కాగా, నిమిషాల్లోనే వైరల్ అయింది.

చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కోరిక మేరకు బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ ఈ పాట పాడగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. లిరికల్ వీడియో లో ఉన్న మహేష్ స్టిల్స్ అద్భుతంగా ఉన్నాయి.

సినిమా విడుదలకు ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగం చేసిన చిత్ర యూనిట్ ఇప్పటికే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయగా, యూ ట్యూబ్ లో అది సరికొత్త రికార్డులను సృష్టించింది.

ఇక ‘ఐ డోంట్ నో…’ అంటూ సాగే ఈ పాటను ప్రస్తుతం పిన్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తోంది. అయితే మీరు కూడా ఈ పాట ఓ సారి వినేయండి మరి….

బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ తొలిసారి తెలుగు లో పాడిన పాట ఇది. ట్యూన్ చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉండడంతో విన్న వెంటనే చాలా డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. అలా విడుదలయిందో లేదో ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గ మారింది.

పాట విన్న మహేష్ బాబు అభిమానులు దేవి శ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సూపర్బ్ గా ఉందని కితాబిస్తున్నారు. చాల కూల్ గా పెప్పిగా ఉండి, యూత్ ని విపరీతంగా ఆకర్షించే విధంగా ఈ పాట ను దేవి కంపోజ్ చేసాడు.

మహేష్ బాబు సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్‌కుమార్‌, ప్రకాష్ రాజ్‌, పోసాని కృష్ణమురళీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు.

శ్రీమంతుడు లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్ ఇచ్చిన మహేష్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భరత్‌ అనే నేనుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రస్తుతం స్పెయిన్‌ లో సాంగ్స్‌ షూటింగ్ తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరగుతున్నాయి. ఏప్రిల్‌ 7న భరత్‌ అనే నేను వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Share

Leave a Comment