ఇంకొక ప్రోమోతో అదరగొట్టాడు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇదొక పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్న ప్రాంతీయ భాష స్టార్ ఎవరైన ఉన్నారంటే అది కేవలం మన సూపర్ స్టార్ మహేష్ బాబు. నేషనల్ వైడ్ ఆయనికి ఉన్న క్రేజ్ మరెవరికీ లేదు అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం ఆయన ఖాతాలో మరో అంతర్జాతీయ బ్రాండ్ ‘ఫ్లిప్ కార్ట్’ చేరిన సంగతి తెలిసిందే. పండుగల సీజన్‌ నేపథ్యంలో ఈ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌లో ‘ది బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ ప్రారంభించనుంది. దీనికి సంబంధిచిన ప్రోమోను తమ ఫ్లిప్‌కార్ట్‌ యూట్యూబ్ ఎకౌంట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే . ఇప్పుడు ఇంకొక యాడ్ ను విడుదల చేశారు.

‘ఇప్పుడు బెడ్‌రూం కాస్త ఖాళీగా అనిపిస్తుంది కదా, బిగ్ బిలియన్ డేస్ తర్వాత ఇది కూడా ఫిల్ అయిపోతుంది. సర్టిఫైడ్ డ్యూరబుల్ బెడ్స్, సైడ్ టేబుల్స్, వార్డ్ రోబ్స్, మాట్రెస్సెస్ వీటన్నికి ఓన్లీ 1500 ఈ.ఎం.ఐ, జీరో ఇంటరెస్ట్ బ్రదర్’ అని తన స్టైల్లో అదరకొట్టారు మహేష్ బాబు. ముఖ్యంగా తన కొత్త లుక్ మరియు హెయిర్ స్టైల్‌తో కట్టి పడేసారు మన సూపర్‌స్టార్.

దేశ విదేశాల్లో సైతం ఊగిపోయేటంత చరిష్మా సొంతం చేసుకున్న హీరో మన సూపర్ స్టార్. అందుకేనేమో పలు అంతర్జాతీయ బ్రాండ్స్ సూపర్ స్టార్ మహేష్ తో తమ్ ప్రొడక్ట్స్ కు ఎండార్స్మెంట్ చేయించుకుంటాయి. రెండు డజన్ల పైగా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వన్ ఆండ్ ఓన్లీ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు.

ఈ సేల్‌ కోసం సెలబ్రిటీలు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణే, విరాట్‌ కోహ్లితో ఫ్లిప్‌కార్ట్‌ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. రీజనల్ యాక్టర్స్ నుండి కేవలం మహేష్ బాబు ఒక్కడే ఈ లిస్ట్ లో ఉన్నాడంటే ఆయనకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియా వైడ్ పాపులర్ స్టార్స్ తో టై అప్ అయి ఈ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ మరింత ప్రమోట్‌ చేయనుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ కోసం దర్శకుడు వంశీ పైడిపల్లి అమెరికాలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. పోయిన నెలలోనే ఆ షెడ్యూల్ ప్రారంభం కావలసి ఉన్నా వీసాలు జారీచేయకపోవడంతో ఆ షెడ్యూల్ ను వాయిదా వేసి హైదరాబాద్ లోనే షూటింగ్ కొనసాగించారు. ఈ వీకెండ్ లోనే ‘మహర్షి’ టీమ్ అమెరికాకు ప్రయాణం అవుతోందట. న్యూ యార్క్, న్యూ జెర్సీ తదితర నగరాలలో ‘మహర్షి’ షూట్ జరుగుతుందని సమాచారం.

Share

Leave a Comment