చెక్ చేసుకుంటున్నమహేష్

సినిమా షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా సమయం దొరికినప్పుడు తన కుటుంబంతో స్పెండ్ చేస్తుంటాడు మహేష్. మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ గానే కాకుండా ఫ్యామిలీ మ్యాన్ గా కూడా పిలవబడుతుంటాడు.

ముఖ్యంగా తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారు. వారికి ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోను ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే అంటుంటారు ఆయన అభిమానులు.

ఇప్పుడు ఇంకా కావాల్సినంత సమయం దొరకడంతో పండగ చేసుకుంటున్నాడు మహేష్. గౌతమ్ సితారాలతో కలిసి ఆడుకుంటూ చిన్న పిల్లాడిగా మారిపోతున్నాడు. అలానే వర్కౌట్స్ చేసుకుంటూ ఫిట్నెస్ మీద ఫోకస్ పెడుతు తాను మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.

ఒకవైపు సామాజిక అంశాలపై స్పందిస్తూనే మరోవైపు ఫ్యామిలీ టైమ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో సోషల్ మీడియా ద్వారా తెలియాజేస్తూనే ఉన్నాడు. త‌న కొడుకు, కూతురితో క‌లిసి ఇప్ప‌టికే అనేక స‌ర‌దా ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. తాజాగా మ‌హేష్ ఒక ఆస‌క్తిక‌ర వీడియో పెట్టాడు.

1 నేనొక్కడినే సినిమాలో బుల్లి సూపర్ స్టార్ గా కనిపించిన గౌతమ్ ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు. అందంలో లుక్స్ లో హైట్ లో తండ్రి మహేష్ కు జెరాక్స్ కాపీలా తయారవుతున్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా చెక్ చేసుకుంటున్నాడు.

కొడుకు కళ్ళముందే తనంత ఎత్తు పెరుగుతున్నందుకు మురిసిపోతున్నాడు. త‌న కొడుకును త‌న ముందు నిల‌బెట్టి అత‌నెంత ఎదిగిపోయాడో చూపించాడు మ‌హేష్‌. మ‌హేష్ భుజాన్ని దాటి ఎదిగిపోయిన‌ అత‌డి కంటే ఒక మూణ్నాలుగు అంగుళాలు మాత్ర‌మే త‌క్కువ ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాడు గౌత‌మ్.

ప్ర‌స్తుతం గౌత‌మ్ వ‌య‌సు 14 ఏళ్లే. కాబ‌ట్టి టీనేజీ దాటేస‌రికి తండ్రిని మించి ఎత్తుకు చేరుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక మ‌హేష్ విష‌యానికి వ‌స్తే లాక్ డౌన్ టైంలో మ‌రింత ఛార్మింగ్‌గా త‌యారైన అత‌ను గ్లామ‌ర్ విష‌యంలో కొడుకుతో పోటీ ప‌డుతున్నాడు.

అయితే ఈ వీడియోలో మహేష్ గౌతమ్ ఇద్దరూ చిన్న పిల్లలుగా టీనేజ్ లోకి వచ్చిన వారిలా కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా వారు అన్నదమ్ములు అని అనుకుంటారు. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ కి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.

మొత్తంగా ఈ లాక్‌డౌన్ స‌మ‌యాన్ని చాలా చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటూ నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అన్న‌ట్లుగా ఎంజాయ్ చేస్తున్న మ‌హేష్‌ను చూసి అభిమానులు కూడా మురిసిపోతున్నారు. లాక్ డౌన్ టైంలో మ‌రింత‌గా ఫ్యామిలీతో బంధాన్ని పెంచుకుంటున్నాడు.

Share

Leave a Comment