కుటుంబ స‌మేతంగా స‌ర‌దాగా

భ‌ర‌త్ అనే నేను రిలీజ్‌కి ముందు అమెరికా యాత్ర‌కు కుటుంబ స‌మేతంగా వెళ్లాడు మ‌హేష్‌. కానీ ఇప్పుడు వేరు.. టెన్ష‌న్ మొత్తం ఫ్రీ అయిపోయాక ప్యారిస్ ట్రిప్ వెళ్లాడు. ఇప్పుడు కూడా కుటుంబంతోనే ఈ ట్రిప్ ప్లాన్ చేశాడు.

త‌న జీవితంలో మునుపెన్న‌డూ అనుభ‌వించ‌నంత ఒత్తిడిని `భ‌ర‌త్ అనే నేను` ముందు అనుభ‌వించాన‌ని మ‌హేష్ ఒకానొక సంద‌ర్భంలో అంగీక‌రించారు. గత రెండు సంవత్సరాలుగా తన చిత్రాల ఫ‌లితం త‌నపై ఒత్తిడి పెంచింద‌ని చెప్ప‌క‌నే చెప్పారు.

అయితే ఆ టెన్ష‌న్లు అన్నిటినీ భ‌ర‌త్ అనే నేను విజ‌యం వ‌ద‌ల‌గొట్టింది. అందుకే ఇప్పుడిలా ప్యారిస్ లోని ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌లో విహార‌యాత్ర‌కు పురిగొల్పింది. కుటుంబ స‌మేతంగా మ‌హేష్ ఇలా స‌ర‌దా స‌మ‌యం గ‌డిపేస్తున్నారు.

కొడుకు గౌతంతో కలిసి ప్రిన్స్‌ పారిస్‌ వీధుల్లో పర్యటిస్తోన్న ఫొటోలు.. ‘రెండై పలికే ఒకే ఓ రాగం.. రెండై వెలిగే దీపం మేమంటా..’ తరహాలో ఉన్నాయని, ఆ ఇద్దరూ తండ్రీకొడుకుల కంటే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారని ఫ్యాన్స్‌ వ్యాఖ్యానిస్తున్నారు.

తమ పర్యటనకు సంబంధించిన వివరాలను నమత్రా ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తున్నారు. కొద్ది గంటల కిందటే..‘టూ ఆఫ్ ఏ కైండ్’ అంటూ ఆమె పోస్ట్‌ చేసిన మ‌హేష్‌-గౌతమ్‌ల ఫొటోకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు.

ఈ విహార యాత్ర‌ ఫోటోలను చూస్తుంటే ఈ సక్సెస్ ను ఎంతలా ఎంజాయ్ చేస్తున్నది తెలుస్తుంది. ఉన్నారు. ముఖ్యంగా గౌత‌మ్‌, సితార‌ల‌కు మ‌హేష్ ఈ ట్రిప్‌ని విజ్ఞాన‌దాయ‌కంగానూ మలుస్తున్నార‌ని ఆ ఫోటోలు చెబుతున్నాయి.

సూప‌ర్ స్టార్ సినిమాకు మంచి టాక్ రావాలే కానీ వసూళ్ల మోత మామూలుగా ఉండదు. అది ‘భరత్ అనే నేను’తో మరోసారి రుజువైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.190 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.

అతి కొద్ది రోజుల్లోనే తిరిగి హైదరాబాద్‌ రానున్న మ‌హేష్‌.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహేష్ బాబుకు 25 వ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాడు. కాగా మహేష్ బాబు 26 వ చిత్రం సుకుమార్ తో చేయనున్నారు.

Share

Leave a Comment