అచ్చం మహేష్ లాగే

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు ని తెరపై చూడ్డం ఒక ఎత్తైతే..తన కుటుంబంతో కలిపి చూడ్డం మరో ఎత్తు. అదే మహేష్ పక్కన కుమారుడు గౌతమ్‌ ఉంటే కళ్లప్పగించి చూస్తుంటారు అభిమానులు. ఇక ఈ ఫొటో గురించైతే చెప్పనక్కర్లేదు.

మహేష్ ఇదివరకు ఓ కార్యక్రమంలో వినయంగా నిలబడిన ఫోటో తో పాటు సరిగ్గా అలాగే మహేష్ కుమారుడు గౌతమ్‌, కూతురు సితార, సతీమని నమ్రత శిరోద్కర్‌లు నిలబడిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందరు అచ్చుగుద్దినట్టు ఒకేలాగా ఉండే పోస్ పెట్టడం విశేషం.

మొన్నామధ్య ఒక ఆడియో వేడుక లో ఇదే సీన్ రిపీట్ అయింది. ఎందుకంటే..ఇద్దరూ తెల్ల షర్ట్‌ వేసుకుని వచ్చారు. అంతేకాదు మహేష్ జేబు లో చేయి పెట్టుకుని స్టైల్‌గా నిలబడితే పక్కన గౌతమ్‌ కూడా తండ్రిలాగే స్టైల్‌గా నిలబడటం అందరి దృష్టిని ఆకర్షించింది.

భరత్ అనే నేను మహేష్ అమ్మగారు ఇందిరా దేవి పుట్టిన రోజు ఏప్రిల్ 20న విడుదలైతే, తమిళంలో ‘భరత్ యనుమ్ నాన్’ పేరుతో, మలయాళంలో ‘భరత్ ఎన్న అంజాన్’ పేరుతో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు నాడు మే 31న విడుదల కానుంది అనమాట. కృష్ణ గారి పుట్టిన రోజు మరియు డబ్బింగ్ వెర్షన్స్ సక్సెస్ ఆనందించటానికి అభిమానులూ సిద్ధంగా ఉండండి.

భరత్ అనే నేను తెలుగు వెర్షన్ తమిళనాడులో ఆల్ టైం రికార్డు స్రుష్టించింది. ఒక్క చెన్నై లోనే ఈ సినిమా రూ.1.70 కోట్ల షేర్ ని సాధించి ‘బాహుబలి 2’ రికార్డుని క్రాస్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.

ఇప్పటికే కేరళలో ఏ తెలుగు చిత్రం కు సాధ్యం కాని రీతిలో పది రోజులకే 1 మిలియన్ రాబట్టి కేరళలో హయ్యస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది భరత్ అనే నేను. ఇక ఇప్పుడు మలయాళం వెర్షన్ ‘భరత్ ఎన్న అంజాన్’ తో కేరళలో మహేష్ క్రేజ్ ఇంకా పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భరత్‌ అనే నేను తర్వాత విదేశాలకి ఫ్యామిలీ వెకేషన్‌కి వెళ్లిన మహేష్‌ ఇంకా తిరిగి రాలేదు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే 25వ చిత్రం లో ప్రత్యేక లుక్‌ తో కనువిందు చేయనున్నారు మహేష్‌. ఈ లుక్‌తో ఈ సినిమా లో ఇంకా యంగ్‌గా కనిపించబోతున్నారట మన సూపర్‌స్టార్ మహేష్‌ బాబు.

Share

Leave a Comment