మహేష్ కు కొత్త అర్థం

స్టార్ హీరోగా తిరుగులేని ఖ్యాతిని సంపాదించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయనకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారతదేశం మొత్తం ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇక ఓవర్సీస్ లో ముఖ్యంగా యు.ఎస్ లో ఆయన క్రేజ్ మామూలుగా ఉండదు.

అక్కడ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన ఫాలోయింగ్ గురించి అభిమానులు ఇంకా గొప్పగా చెప్పుకునేలా ఇప్పుడు ఇంకొక అవకాశం వచ్చింది. అందుకు మహేష్ అభిమానులకు అవకాశం ఇచ్చింది పేర్లకు నిర్వచనాలు చెప్పే ‘అర్బన్ డిక్షనరీ’.

మహేష్ బాబు పేరుకు సరికొత్త అర్థం చెప్పింది ‘అర్బన్ డిక్షనరీ’ యాజమాన్యం. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లైక్ లు, షేర్లుతో ఆ పోస్ట్ ను వైరల్‌గా మార్చేస్తున్నారు. అర్బన్ డిక్షనరీలో ఏదైనా పేరు టైపు చేస్తే అది ఆ పేరుకు అర్థాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది.

ఈ నేపథ్యంలో అర్బన్ డిక్షనరీ ‘మహేష్ బాబు’ పేరుకు రెండు నిర్వచనాలను పేర్కొంది. ‘మహేష్ బాబు సెక్సీ ఇండియన్ తెలుగు యాక్టర్. అమ్మాయిలంతా అతని ప్రేమలో పడిపోతారు. అందరూ అతన్ని ప్రిన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అతను చాలా ఆకర్షనీయంగా, అందంగా ఉంటాడు.

నేను అతన్ని ఓ సినిమాలో చూశా అతను చాలా హాట్‌గా ఉన్నాడు’ అని తెలిపింది. మహేష్ బాబు అభిమాని ఒకరు మహేష్ బాబు పేరుకు నిర్వచనం చెప్పాలని అర్బన్ డిక్షనరీకి ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అర్బన్ డిక్షనరీ మహేష్ బాబు నిర్వచనాన్ని ట్వీట్ చేసింది. దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.

ఈ ఫాలోయింగే మహేష్ బాబు ను మోస్ట్ వాంటెడ్ స్తార్ గా మార్చేసింది. కార్పొరేట్ సంస్థలన్నీ తమ ఉత్పత్తులు ఎండార్స్ మెంట్ విషయంలో మహేష్ బాబు అయితేనే బెస్ట్ అన్న భావనలో ఉన్నాయి. ఎందుకంటే మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ తో తమ ఉత్పత్తుల ప్రజల్లోకి త్వరగా చేరతాయని వాళ్ళ ఉద్దేశం.

ఎండార్స్ మెంట్ విషయంలో మహేష్ బాబు సౌత్ ఇండియాలోనే రారాజు అని చెప్పొచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు అనేక టాప్ మోస్ట్ కార్పొరేట్ సంస్ధకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యాడ్స్ విషయంలో మరే సొంత ఇండియన్ హీరో మహేష్ కు పోటీ ఇవ్వలేకపొతున్నారు.

బాలీవుడ్ స్టార్లకు సైతం మహేష్ ధీటుగా నిలుస్తున్నాడు. తాజాగా మహేష్ బాబు మరో సంస్థకు బ్రాండింగ్ కల్పించేందుకు సైన్ చేశారు. ‘డెన్వెర్ డియోడ్రెంట్ సంస్థ’ తాజాగా మహేష్ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. నార్త్ లో ఈ సంస్థకు షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

ఇక ఇప్పటి నుండి డెన్వెర్ సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు కొనసాగుతారు. ఇప్పటికే థమ్స్ అప్, ఫ్లిప్ కార్ట్, ఇంటెక్స్ మొబైల్స్, క్లోసప్, సంతూర్, య‌ప్ టీవీ, అభి బస్, గోల్డ్ విన్నర్, చెన్నయ్ సిల్క్స్, లాయిడ్ వంటి 30 పాపులర్ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు మహేష్.

ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతోంది. విభిన్నమైన గెటప్పుల్లో మహేష్ అలరించనున్నాడని ఇప్పటికే ప్రచారమవుతోంది. అందులోను ఇది మహేష్ ల్యాండ్‌మార్కు 25వ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగా హైప్ పెరుగుతోంది.

నేటి నుండి మహర్షి మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఈ షూటింగ్ జరగనుంది. సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ముందు తెలిపినా ఆ తరువాత రిలీజ్ డేట్ వాయిదా పడిందని, ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజు ‘మహర్షి’ సినిమా డేట్ ని అనౌన్స్ చేశారు.

దిల్ రాజు, అశ్వినీదత్ మరియు పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలేజీ స్టూడెంట్ గా, అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా మొదలగు అవతారాల్లో కనిపించనున్న మహేష్ బాబు ఇంకా ఎవరూ ఊహించని ఒక కొత్త అవతారాన్ని కూడా ఎత్తనున్నాడని తెలుస్తోంది. దాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు మహర్షి చిత్రబౄందం.

Share

Leave a Comment