అదరగొట్టిన సూపర్‌స్టార్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భరత్ అనే నేను లో స్మార్ట్ గా కనిపించిన మన సూపర్ స్టార్ ఇప్పుడు తన 25వ సినిమాకోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నారని తెలిసిన విషయమే.

మహేష్ తన కొత్త లుక్ తో లేటెస్ట్ గా ఒక టీ.వి కమర్షియల్ లో నటించారు. ఈ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ తన న్యూ లుక్ తో అదరగొడుతున్నాడనే చెప్పాలి. అభిమానులు ఫుల్ ఖుషీగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ చేసేస్తున్నారు.

మహేష్ తన న్యూ లుక్ తో ‘గోల్డ్ విన్నర్’ కి ఒక యాడ్ చేసారు. నేడు సదరు కంపెనీ వారు ఈ వీడియో ని విడుదల చేసారు. ఈ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ తన కొత్త లుక్ తో అదరగొడుతున్నాడనే చెప్పాలి. గడ్డం తో ఎక్కువ పొడవాటి హెయిర్ స్టయిల్ లో సూపర్‌స్టార్ చాలా అందంగా కనిపిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు భారతదేశంలోని చాలా ముఖ్యమైన బ్రాండ్‌లకు అంబాసడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు ఇదొక పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్ అన్న టాక్ ఇప్పటికే కార్పొరేట్ రంగంలో నెలకొంది. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో టాప్‌లో ఉన్న కంపెనీలన్నీ రీజనల్‌ స్థాయికి వచ్చే సరికి ఎపి మార్కెట్‌ కోసం సూపర్ స్టార్ మహేష్‌ వద్దకే వస్తున్నాయి.

ఇప్పటికే థంప్స్ అప్, య‌ప్ టీవీ, అభి బస్, గోల్డ్ విన్నర్, చెన్నయ్ సిల్క్స్, ఇంటెక్స్, లాయిడ్, టివిస్, మహేంద్ర, అమృతాంజన్‌, నవరత్న ఆయిల్‌, యూనివర్సెల్‌, ఐడియా సెల్యులార్‌, ప్రొటీనెక్స్, జాస్‌ అలుక్కాస్‌, ప్రొవోగ్‌, వివెల్‌ షాంపూలకు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుత స్టార్ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా మహేష్ అంటే అందరికీ అభిమానమే. ఆయకున్న మహిళా అభిమానులైతే మరీ ఎక్కువ. ప్రస్తుతం మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం ‘మహర్షి’ చేస్తున్నారు. సూపర్ స్టార్ ఇప్పటి వరకు చేసిన సినిమాలను మించిపోయేలా, ఒక గొప్ప ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనే అంచనాలు అభిమానుల్లో ఏర్పడ్డాయి. విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ వారి అంచనాలను మరింత పెంచింది.

Share

Leave a Comment