సూపర్ ఫ్యాన్స్ గురించి మహేష్ ఏమన్నారంటే

వరుస విజయాలతో దూకుడు మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగంలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హంబుల్ బ్రాండ్ దుస్తులను పార్క్ హయత్‌లో బుధవారం అట్టహాసంగా ఆవిష్కరించారు. స్పోయల్ సంస్థతో కలిసి హంబుల్ బ్రాండ్ పేరుతో 160 రకాల దుస్తులను వినియోగదారుల అందుబాటులోకి తెచ్చారు.

యువకుల నుంచి వృద్ధుల దాకా ఆకర్షణీయంగా, అందుబాటు ధరలో క్యాజువల్ షర్ట్స్, టీ-షర్టులను అందిస్తోంది హంబుల్. మహేష్ ఐడియాస్ కు ఆలోచనలకు అనుగుణంగా బ్రాండింగ్ క్లాత్స్ ని డిజైన్ చేశారు. హ్యాండ్ లూమ్ డే ఆగస్టు 7న ఈ బ్రాండ్ ని మార్కెట్ లోకి విడుదల చేయడం ప్రత్యేకతగా చెప్పి తీరాల్సిందే.

నా స్టైల్‌ ఎప్పుడూ సింపుల్‌గా, క్లాసిక్‌గా ఉంటుంది. నేనెప్పుడూ నాకు సౌకర్యవంతంగా ఉండే దుస్తుల్నే ధరిస్తాను. జీన్స్‌, చెక్డ్‌ షర్ట్‌ నాకిష్టం. నమ్రతతో నేను డేట్‌కి వెళ్లినప్పుడు నేనేం ధరించానో గుర్తులేదు. మళ్లీ ఇంకోసారి వెళ్లినా చెక్డ్‌ షర్ట్‌ వేసుకుంటానేమో. నాకు బ్లూ కలర్‌ షర్టులంటే చాలా ఇష్టం. నమ్రత నాకు వాటినే బహుమతిగా ఇస్తుంది అని మహేష్ బాబు అన్నారు.

నా పుట్టినరోజుకు రెండు రోజులకు ముందు, వరల్డ్‌ హ్యాండ్‌లూమ్‌ డే రోజు నా బ్రాండ్‌ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. నా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో నా పుట్టినరోజును ట్రెండింగ్‌ చేస్తున్నారు. అంత గొప్ప అభిమానులు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకు ఎప్పుడూ ఋణపడి ఉంటాను. ఎదుటివారిలో ఉన్న రియాలిటీని నేను ఇష్టపడతాను. వస్త్రధారణ విషయంలోనూ అంతే అని అన్నారు.

ఈ తరహా బిజినెస్‌ గురించి ఎప్పటి నుంచో మనసులో అనుకుంటున్నా. స్పాయిల్‌ భార్గవ్‌ వచ్చి చెప్పినప్పుడు కాన్సెప్ట్‌ చాలా నచ్చింది. లివ్‌ రియల్‌, స్టే హంబుల్‌ అనేది నేను నమ్మే ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌. నా వ్యక్తిత్వం నా బ్రాండ్‌లో ప్రతిబింబించాలనుకున్నాను. అంతేగానీ రాత్రికి రాత్రి ఈ బిజినెస్‌ మొదలుపెట్టలేదు. ఎప్పుడైనా సినిమాలకే నా తొలి ప్రాధాన్యం. వచ్చే రెండేళ్లు సినిమాలతో నేను చాలా బిజీగా ఉన్నాను. చాలా ఎగ్జయిటింగ్‌ ప్రాజెక్టులు చేస్తున్నాను అని అన్నారు మహేష్.

భార్గవ్ ఈ విషయమై మాట్లాడుతూ ఈ బ్రాండ్ గురించి అనుకున్నపుడు, మహేష్ సర్‌ను కలిసినపుడు ఈ పేరు కేవలం రాండమ్‌గా పెట్టలేదు. చాలా మంది మహేష్ సర్‌ అభిమానులతో చర్చించిన తర్వాతే ఈ పేరు ఫైనల్ చేసినట్లు తెలిపారు. వాటి నుంచి వచ్చిన పేరు హంబుల్. మహేష్ సర్‌ వ్యక్తిత్వానికి రిప్లెక్షన్ లా ఉంటుంది కాబట్టే ఈ పేరు ఎంచుకున్నాం.

1)

2)

3)

4)

నిజంగానే ఆయన హంబుల్, డౌన్ టు ఎర్త్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగినప్పటికీ హంబుల్‌గా, వినమ్రంగా ఉంటారు అని భార్గవ్ తెలిపారు. ఓ లేడీ రిపోర్టర్ మాట్లాడుతూ నా భర్త నన్ను నమ్రత అని పిలుస్తారు, నేను ఆయన్ను మహేష్ అని పిలుస్తాను. వాస్తవానికి మా పేర్లు అవి కాదు. ఆయన మీకు పెద్ద అభిమాని.

మీరు మహారాష్ట్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన నన్ను ఎంచుకున్నారు. నేను కూడా మహారాష్ట్రకు చెందిన అమ్మాయినే అనడంతో సభలో నవ్వులు పూశాయి. ఈవెంట్ జరుగుతుండగా ఓ వ్యక్తి మైక్ అందుకుని ప్రశ్నలు ఏమీ లేవు, నేను మీకు చిన్నప్పటి నుంచి పెద్ద అభిమానిని. మొదటిసారి లైవ్‌లో చూస్తున్నాను. మీతో ఒక్క ఫోటో దిగాలని ఉంది అని అడగటంతో మహేష్ వెంటనే వచ్చేయ్ అంటూ అతడిని స్టేజీమీదకు పిలిచి అతనితో ఫొటో దిగారు.

మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు 26వ సినిమాగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ యమా స్పీడ్ గా జరుగుతోంది. అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంక్రాంతి సీజన్ ని లాక్ చేశారు కానీ డేట్ ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది.

Share

Leave a Comment