మహేష్ బాబు మెచ్చిన సినిమా

సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వింటేనే లక్షలాది మంది అభిమానుల హృదయాలలో అలజడి కలుగుతుంది, ఉత్సాహం ఉప్పొంగుతుంది. అటువంటి మహేష్ బాబు కు అభిమాన దర్శకుడు ఒకరు ఉన్నారు. ఆయనెవరో కాదు ఎన్నో వైవిధ్యమైన సిన్మాలతో భారతదేశంలోనే ఆయనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం.

మణిరత్నం దర్శకత్వంలో తాజాగా వచ్చిన సినిమా ‘చెక్క చివంత వానమ్’. తెలుగులో ‘నవాబ్’ పేరుతో అనువాదమైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని, మణిరత్నం మళ్లీ ఫాంలోకి వచ్చారని అంటున్నారు. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు. దర్శకుడు మణిరత్నం కు అభిమానినని, చెన్నై లో థియేటర్స్ లో క్లాప్స్ కొడుతూ మణిరత్నం సినిమాలు చూసేవాడినని, ఇప్పుడు చెక్క చివంత వానమ్ సినిమా చూసి క్లాప్స్ కొట్టి కాలర్ ఎగురవేశానని, నటీ నటుల నటన బాగుందని, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కు ఎవరూ సాటిరారని, సంతోష్ శివన్ ప్యూర్ క్లాస్ అని ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ ట్వీట్ కు హీరో అరవింద స్వామి వెంటనే తన ట్వీట్ల ద్వారా స్పందించారు. ‘చాలా థాంక్స్ మహేష్’ అని మహేష్ చేసిన ట్వీట్ కి రిప్లయి ఇచ్చి మహేష్ ట్వీట్ ని తిరిగి తన ఖాతా నుండి రిట్వీట్ కూడా చేసారు అరవింద స్వామి. హీరోయిన్ అదితి రావు కూడా మహేష్ కి థాంక్స్ చెప్పింది. “ఇప్పీ..చాలా చాలా థాంక్స్ మహేష్” అని సంబరపడిపోతూ మహేష్ ట్వీట్ ని రిట్వీట్ చేసింది. మహేష్ మెసేజీ కి అదితి థ్రిల్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు, ఇంతక మునుపు కూడా ఒకసారి మహేష్ చేసిన మెసేజి కి అదితి చాలా ఎక్సైట్మెంట్ తో రిప్లయి చేసింది.

తరువాత ‘ఎవరైనా ఈ చిత్రాన్ని ఇప్పటివరకు చూడకుంటే వెళ్లి చూడంటి. ఓ క్లాసిక్‌కు మనం సాక్షులం. మూవీ ఆఫ్ ది డెకడ్. ధ మాస్టర్ ఈజ్ బ్యాక్’ అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మణిరత్నం లాంటి దర్శకుడితో సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో కలలు కంటుంటాడు. ఆయన ఎంత గొప్ప దర్శకుడనే విషయం అందరికీ తెలిసిందే.

కొత్త రకమైన సినిమాలను ప్రశంసించడంలో ముందు వరుసలో ఉంటోన్న ప్రిన్స్, మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు చూసి వాటికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు మహేష్. అలాగే ఏదైనా టీజర్, ట్రైలర్ నచ్చినా ప్రశంసిస్తూ లింక్ షేర్ చేస్తున్నారు. ఇలా ప్రతీ విషయంలోనూ తోటి నటీనటులకు ఆదర్శంగా నిలుస్తూ తాను నిజమైన సూపర్ స్టార్ అని చాటుతున్నారు మహేష్ బాబు.

Share

Leave a Comment