ఫోర్బ్స్‌ టాప్‌ 100 లిస్ట్‌లో…

ఇందు మూలముగా యావన్మందికీ తెలియజేయునది ఏమనగా మన టాలీవుడ్‌ సెలబ్రిటీలు కొందరు ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరారు.

ఇంతకీ ఆ లిస్ట్‌ స్పెషాల్టీ ఏంటి? అంటే.. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో దేశంలో అత్యధిక సంపాదనపరులు ఎవరు?’ అనే జాబితాను ప్రతి ఏడాదీ ‘ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌’ వాళ్లు విడుదల చేస్తారు.

ఇది చాలామందికి తెలిసిన విషయం. ఈసారి రిలీజైన లిస్ట్‌ మన టాలీవుడ్‌ కాలరెగరేసేలా ఉంది.

ఎక్కువమంది సెలబ్రిటీలకు ఈ ‘టాప్‌ 100’ లిస్ట్‌లో చోటు దక్కింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కి 37వ స్థానం వచ్చింది.

అక్టోబర్‌ 1, 2016 నుంచి సెప్టెంబర్‌ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారి లిస్ట్‌ను పోర్బ్స్‌ ఎనౌన్స్‌ చేసింది.

టాప్ 1వ స్థానం లో సల్మాన్ ఖాన్ నిలబడ్డారు.ఈ యొక్క స్థానాలు సెలబ్రిటీస్ యొక్క సంపాదన మీద ప్రకటిస్తారు.

మహేష్ బాబు యొక్క సంపాదన అక్షరాల 19.63కోట్లు అని ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది.

ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన లిస్ట్ లో మహేష్ కి వచ్చిన ర్యాంక్ చూసి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

గత ఏడాది 2016 లో మహేష్ కి 33వ ర్యాంక్ వచ్చింది. 2015 లో  36వ ర్యాంక్, 2014 లో మహేష్ కి 30వ ర్యాంక్ వచ్చింది.

2013 లో 54వ ర్యాంక్, 2012 లో మహేష్ కి 31వ ర్యాంక్ వచ్చింది. ఇలా ప్రతి ఏడాది మహేష్ ఈ లిస్ట్ లొ చోటు సంపాదించుకుంటున్నారు.

రాజమౌళి 100 మందిలో 15వ స్థానం దక్కించుకోవడం గర్వించదగ్గ విషయం. టాలివుడ్ లో ప్రధమ స్థానం లో నిలిచారు.

తెలుగు హేరో ల లో ఈ ఏడాది మహేష్, ప్రభాస్‌ , రానా , పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌ ఈ లిస్ట్ లో చోటు దక్కించుకున్నారు.

గతేడాది పోర్బ్స్‌ జాబితాలో ఓన్లీ మహేష్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ మాత్రమే ఉన్నారు. ఈ ఏడాది సంఖ్య పెరగడం మనం ఆనందించాల్సిన విషయం.

గత ఏడాది సౌత్‌ నుంచి 11 మంది ఫోర్బ్స్‌ లిస్ట్‌లో ఉంటే, ఈ ఏడాది 13 మంది ఉండటం ఆనందించదగ్గ విషయం.

Share

Leave a Comment