ఫరెవర్ డిజైరబుల్

సాధారణంగా ఏళ్లు గడిచేకొద్ది అందం తగ్గిపోతుంటుంది అంటారు. కానీ మహేశ్‌బాబు విషయంలో అలా కాదు. సినిమా సినిమాకీ ఆయన అందం రెట్టింపవుతోంది. ఇందుకు తాను తీసుకునే ఆహారమే కారణమని మహేశ్‌ ఒకానొక సందర్భంలో తెలిపారు. అందం ఒక్కటే కాదు అంతకుమించి అభినయం తన సొంతం.

ప్ర‌తి ఏడాది ప్ర‌ముఖ ఆంగ్ల వార్త పత్రిక మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్, ఉమెన్ జాబితాని ప్ర‌క‌టిస్తూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆఫ్ 2019 జాబితాను విడుదల చేసింది. దీంతో పాటే ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ పేరుతో మరో జాబితాను కూడా ప్రకటిస్తుంది.

అయితే ఈ జాబితా స్పెషల్ ఏమిటంటే ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్ స్థానంలో నిలుస్తున్న కొందరికి మాత్రమే ఇందులో చోటు ఉంటుంది. ఈ క్లబ్‌లో చోటు దక్కినవాళ్ల పేర్లు మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో ఉండరు. ఎందుకంటే మోస్ట్ డిజైరబుల్ జాబితాలో కొత్తవారికి అవకాశం కల్పించడం కోసం.

అయితే పోయిన సంవత్సరం వరకు ఈ జాబితాలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ జాబితాలో చేరారు. ప్రతిసారి మహేష్ మోస్ట్ డిజైరబుల్ జాబితాలో టాప్ స్థానంలో నిలుస్తుండటంతో ఆయన పేరును ఫరెవర్ డిజైరబుల్ క్లబ్‌లో చేర్చారు.

హైదరాబాద్ టైమ్స్ విడుదల చేసిన 30మంది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2019 లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు లేడు. అసలు 2012 2013 2015 సంవత్సరాలలో నెం.1 గా నిలిచిన మహేష్ బాబును లిస్టులోనే లేకుండా చేయడమే షాకింగ్ అనుకునే అభిమానుల కోసం టైమ్స్ పత్రిక మరోసారి క్లారిటి ఇచ్చింది.

నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ లిస్ట్ లో లేకపోవడానికి కారణం ఆయన ఆల్రెడీ ఫరెవర్ డిజైరబుల్ లిస్టులో చేరడమే. ఇండియా లో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అమిర్ ఖాన్ ల తర్వాత మహేష్ బాబుకే అందులో స్థానం దక్కింది.

ఫరెవర్ డిజైరబుల్ లో చేరారు కాబట్టే ఇయర్లీ ఒకసారి మారే మోస్ట్ డిజైరబుల్ లిస్టులో నుండి ఆయన పేరును తొలగించినట్లు పత్రిక తెలిపింది. ఈ లిస్ట్‌లో కేవలం కొత్త వారికి మాత్రమే చోటు ఉంటుంది. 2019 లిస్ట్‌లో హీరోయిన్ సమంత హీరో విజయ్ దేవరకొండ ప్రథమ స్థానంలో నిలిచారు.

హాలీవుడ్ కటౌట్ తో టాలీవుడ్ ను ఏలుతున్నాడు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా మహేష్ క్రేజ్ మాత్రం చెక్కుచెదరదు. అతడి అడుగు పడితే వెండితెర ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. అతడు అభినయిస్తే ఆ సినిమా హుందాగా నడుస్తుంది. తెలుగు సినిమా వెలుగులో అభిమానులకు ఆకాశమంత ఆనందాన్ని పంచుతున్నాడు.

Share

Leave a Comment