విజయవాడలో సూపర్‌స్టార్

ప్రస్తుత స్టార్ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా మహేష్ అంటే అందరికీ అభిమానమే. ఆయకున్న మహిళా అభిమానులైతే మరీ ఎక్కువ. మహేష్‌ బాబు ని రియల్‌గా చూడాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. అయితే మహేష్ తెర మీద తప్పితే బయట మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటారు.

తాజాగా విజయవాడ లోని భీమా జ్యువెలర్స్ ఓపెనింగ్ కి మహేష్‌బాబు విచ్చేశారు. దీంతో ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. వేల సంఖ్య లో అభిమానులు తరలి వచ్చి సందడి చేసారు. సూపర్‌స్టార్ స్లోగన్స్ తో సదరు స్టొర్ వారు ఏర్పాటు చేసిన మహేష్ కొత్త కటౌట్స్ ముందు సూపర్ ఫ్యాన్స్ హంగామా కన్నుల పండుగగా ఉంది.

1)

2)

3)

4)

5)

6)

7)

8)

అభిమానులు సోషల్ మీడియాలో ఈ పిక్స్ ని వీడియోలను షేర్ లు లైక్ లు చేస్తూ వాటిని తెగ వైరల్ చేస్తున్నారు. మరొకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్ ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్ర విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎన్నో ప్రత్యేకలతో వస్తోన్న ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. విజయ శాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఇలా ప్రతీదీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్న దర్శకుడు సూపర్ స్టార్‌ను ఓ రేంజ్‌లో చూపించాడని టాక్.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు. దీని చుట్టు జరిగే సీన్స్, యాక్షన్ పార్ట్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేసేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాని జనవరి 12, 2020న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

Share

Leave a Comment