థియేటర్లో హోరెత్తించిన వేళ..

టాలీవుడ్ లోనే కాదు యావత్తు దేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలలోనే అందగాడు. అమ్మాయిల కలల రాకుమారుడు, ప్రేక్షకులకు ఆరాధ్యదైవం. నేటి తరం హీరోయిన్లను మీకు ఎలాంటి భర్త కావాలి అని అడిగితే మరో మాట లేకుండా అందరూ ఏకగ్రీవంగా చెప్పే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.

వన్ మ్యాన్ షో తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను సరికొత్త రికార్డులని పరిచయం చేస్తూ సినిమాలను విజయతీరాలకు నడిపే సత్తావున్నవాడు. నిర్మాత బాగుకోరుకునే మంచి మనసున్న మనిషి. ప్రయోగాత్మక సినిమాలకు ఎప్పుడు ముందుడే డేరింగ్ & డాషింగ్ హీరో. తన సంపాదనలో ముప్పై శాతం స్వచ్చంద సంస్థలకు ఇస్తూ దాన గుణం లో కర్ణుడు వంటి వాడు.

సినిమాలోని సంభాషణలు వ్రాసేది రచయితే అయినా, వాటిని మహేష్ పలికే విధానంలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. తనదైన ప్రత్యేకమైన శైలి లో చిన్న డైలాగ్ చెప్తే చాలు థియేటర్ అంతా హోరెత్తిపోడానికి. ఆయన సినీప్రస్థాణం లో ఇలాంటి డైలాగ్స్ ఎన్నో ఉండగా వాటి నుండి కొన్ని తూటాల్లాంటి డైలాగ్స్ ను మరొకసారి ఓ లుక్కేద్దామా

తెల్ల డ్రెస్ వేసిన ప్రతోడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదు. పాత బస్తి. యుద్దం మొదలయ్యాక మధ్యలో వదిలేయడం మగతనం అనిపించుకోదు. ఒక్కడు మహేష్ ని ప్రిన్స్ నుంచి మాస్ హీరోగా ఎలివేట్ చేసిన సినిమా ఇది.

నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయ్యలనుకోవటం మోసం, మనల్ని చంపాలనుకునేవాడిని చంపడం యుద్ధం, మనల్ని కావాలనుకునే వాళ్ళని చంపడం నేరం. మనల్ని మోసం చేయాలనుకునేవాడిని చంపడం న్యాయం

నాతో మాట్లాడితే బాజిరెడ్డి తో మాట్లాడినట్టే. మిమ్మల్ని చంపితే బాజిరెడ్డిని చంపినట్టేనా? నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు.. గన్ను చూడలనుకోండి తప్పు లేదు. కానీ బుల్లెట్ చూడలనుకోవద్దు చచ్చిపోతారు. సరే పొలిటికల్ కన్సెసన్ ఏమీ లేదా బాబూ? ఫ్రీ గా మిమ్మల్ని కాల్చిపెడతాను.

ఇక్కడ పండుగాడు ఎవడు, పండు కౌన్ హై రే ఇదర్? అని అంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అని మహేష్ వాడిని ఒకటి పీకి చెప్పే డైలాగ్ ఎపిక్ అనే చెప్పాలి. మహేష్ కెరీర్ లో థి బెస్ట్ ఇంట్రో పొకిరి సినిమాలో సీన్ అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు.

పది మంది ఉన్నారు ఏసేస్తే వెల్లిపోవచ్చు, మాస్ కి విపరీతంగా నచ్చే హీరో ఎలివేషన్ సీన్. వేరే గ్యాంగ్ వాడు నిన్నగాక మొన్న వచ్చి ఏంటిరా నువ్వు అంటే ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా బులెట్ దిగిందా లేదా అని మహేష్ చెప్పే సీన్ కి గూస్‌బంప్స్ గ్యారెంటీ.

స్టేషన్ లో కానిస్టేబుల్ అనుకున్నావా? మొన్న రెవాల్వర్ దొరికింది అన్నా కదా అది నాదే… అనవసరంగా పుట్టావ్, మీ నాన్న. పద్మావతి హ్యాపీ ఆ, టైల్స్ వేస్తున్నారంటగా… రివాల్వర్ నాదే, శృతి నాదే ఎప్పుడిస్తున్నావ్ నా రివాల్వర్?

మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్లిపోతాను భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది. నాకు ఒక్క నిముషం టైమిస్తే ఆలోచిస్తా, రెండు నిముషాలు టైమిస్తే యాక్షన్లో దిగుతా, మూడు నిముషాలు టైమిస్తే ముగించేస్తా. దిస్ ఈజ్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిజ్ ఈజ్ ఆల్ టైం రికార్డ్

జీవితం అనేది ఒక యుద్దం, దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేసాడు, బీ ఎలర్ట్, ప్రొటెక్ట్ యువర్‌సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి, పాడలనుకుంతే కసి గా పాడెయ్యండి, చదవాలనుకుంతే కసి గా చదివేయండి, లైఫ్ లో ఏ గోల్ లేనొల్లు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోంది మీ వల్ల మకు ఏ ఉపయోగం లేధు.

ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలో ఆడే హీరో సార్. ఇక్కడ ముంబయి లో ప్రతీ ఒక్కడికీ ఒక కల ఉంటుంది సార్. మీ కల నాకు నచ్చదు. నా కల మీకు నచ్చదు. అందుకే ప్రపంచం కోసం ఎవడు కల కన్నా అది కల గానే మిగిలిపోతుంది సార్.

సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో గానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగానే ఉంది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు వాట్ టు డు వాట్ నాట్ టు డు. ప్రతీ వాడు సింహాలు పులులు ఏనుగులు ఎలుకలు అంటూ ఎదవ కంపారిషన్స్. ఎలపరం వచ్చేత్తుంది.

ఎదుగుదల అంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎదగడం. ఊరు చాలా ఇచ్చింది, ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావయిపోతారు. ఊరిని దత్తత తీసుకోవడమంటే. జేబులో డబ్బులు తీసి రోడ్లు, రంగులేసి వెళ్ళిపోతాననుకున్నార్రా, వీడ్ని వాడ్ని వాడ్ని వెళ్ళందర్నీ నిన్ను మొత్తాన్నే దత్తత తీసుకున్నా.

హౌస్ లో డౌట్స్ క్లియర్ అయితే ఐ విల్ టేక్ ఏ లీవ్ మేడమ్ స్పీకర్. మనుషుల మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు. మనం సొసైటీ లో ఉంటున్నాం. ప్రతీ ఒక్కరికీ భయం భాధ్యత ఉండాలి.

Share

Leave a Comment