యూకే వెళ్ళనున్న భరత్ …

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “భరత్ అనే నేను” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటివలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కూడా మూవీ పై అందరికి ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసాయి. ఇదిలా ఉంటే దాదాపు ఈ మూవీ షూటింగ్ మొత్తం వేగంగా పూర్తిచేస్తున్నారు.

హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం పూర్తి కాలేదు అని తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ ని భారీగా యూకేలో లో ప్లాన్ చేసాడు అంట దర్శకుడు కొరటాల శివ.

ఆల్రెడీ యూకేలో కొన్ని అద్భుతమైన లొకేషన్స్ ఎంపిక పూర్తయిందని. త్వరలోనే మహేష్ బాబుతో పాటు టీం మొత్తం లండన్ బయల్దేరనున్నారని తెలుస్తోంది.

ఈ పాట ఒక్కటి కంప్లీట్ చేస్తే ఇక ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పార్ట్ పెద్దగా ఏమి ఉండదని సమాచారం. మూవీ రిలీజ్ కి రెండు నెలల ముందే షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ ని నీట్ గా కంప్లీట్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం సందేహాలు ఉన్నాయి.. మే నెలకు వాయిదా పడిందనే టాక్ కూడా వినిపించింది. కానీ ఈ సినిమాను ఏప్రిల్ 27కే విడుదల చేసే లక్ష్యంతో.. చకచకా షూటింగ్ చేసేస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగిపోతున్నాయి.

మహేష్ షూట్ లో గ్యాప్ కూడా ఎక్కువగా తీసుకోకుండా చకచకా కానిచ్చేస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు టెక్నికల్ టీంతో సన్నిహితంగా మెలుగుతూ.. వారిలో ఉత్సాహం నింపుతున్నాడట.

తదుపరి షెడ్యూల్ ను పూణెలో పూర్తి చేసి, ఆ తరువాత షెడ్యూల్ ను ఫారిన్ లో జరుపుతారట. 16 రోజులపాటు జరిగే ఆ చివరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు.

ఈ చిత్రం కథాకథనాలపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రం ద్వారా శ్రీమంతుడు కాంబో మరొకసారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్రకు నేను న్యాయం చేయగలనని కొరటాల నమ్మారు. ఇక తొలి చిత్రం మహేష్ బాబు తో కావడం నా అదృష్టం. నన్ను ఇంతగా ఆదరిస్తున్న అభిమానుల అంచనాలను అందుకోవడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అని కైరా తెలిపారు.

ఇతర కీలక పాత్రల్లో ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల.

Share

Leave a Comment