మ‌హేష్ ఫెంటాస్టిక్‌ : శ్ర‌ద్ధా క‌పూర్‌

ఆషికి-2 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రద్దా కపూర్ కేవలం నటిగా మాత్రమే గాక సింగర్ గాను, గీత రచయిత గాను గుర్తింపు తెచ్చుకున్నారు.

బాలీవుడ్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన శ్ర‌ద్ధా కపూర్ ఇప్పుడు టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.

తాజాగా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన శ్రద్దా కపూర్.. అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

మ‌హేష్ గురించిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. `ఆయ‌న మైండ్‌బ్లోయింగ్‌.. ఫెంటాస్టిక్‌` అని చెప్పింది.

ఈ మాట దూకుడులో మహేష్ బాబు డైలాగ్‌ను గుర్తుచేస్తోంది. మహేష్ అంటే తనకి ఇష్టం అని ఇప్పటికే పలు మార్లు ఇంటర్వ్యూలలో వెల్లడించింది.

మంచి ఆఫర్ వస్తే మహేష్ తో కలిసి నటించడానికి తాను రేడి అని చెప్తుంది ఈ బాలివుడ్ బ్యూటి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఫ్యామిలీ పర్సన్ గా మాత్రం చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే.

ఆయన చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని అందరు ఇష్టపడతారు. చాలా మంది హీరోయిన్స్ కి మహేష్ తో కలిసి నటించాలని ఉంది అని ఇప్పటికే చాల సందర్భాలలో వెల్లడించారు.

ఇప్పుడు ఈ జాబితా లోకి శ్ర‌ద్ధా క‌పూర్‌ కూడా చేరింది. ఆమె కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.

అయితే చాలా రోజుల నుండి షూటింగ్ లతో బిజీగా ఉండడంతో మహేష్ మళ్లీ కొంచెం బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని జరుపుకోవాలని అననుకుంటున్నాడు.

అందుకోసం విదేశాలకు వెళ్లనున్నాడట. అందమైన ప్రదేశాలను ఫ్యామిలీతో కలిసి గడిపి రావాలని మహేష్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా న్యు ఇయర్ ని విదేశాల్లోనే సెల్ బ్రేట్ చేసుకోబోతోంది మహేష్ బాబు ఫ్యామిలీ..!

Share

Leave a Comment