సూపర్ స్టార్ పై పొగడ్తల వర్షం

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాలు చేయాలని ఎందరో టాప్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే ఎవర్ని కాదనకుండా, హర్ట్ చేయకుండా తన స్వీట్ స్మైల్ తో కాలం గడపడం మహేష్ స్ట్రాటజీ. ఇలాంటి పరిస్తుతులలో దర్శకుడు హరీష్ శంకర్ అన్న మాటలకు మహేష్ తన తియ్యటి నవ్వుతో ఇచ్చిన సమాధానానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రెండు రోజుల క్రితం జరిగిన ‘సమ్మోహనం’ మూవీ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన మహేష్ ను దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు. ‘పోకిరి, బిజినెస్ మేన్ సినిమాల్లో మహేష్ నటనలో పూరి జగన్నాథ్ బాడీ లాంగ్వేజ్ టైమింగ్ కనిపిస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో శ్రీకాంత్ అడ్డాల స్టయిల్ కనిపిస్తుంది. దూకుడులో శ్రీను వైట్ల టైమింగ్ కనపడుతుంది. కొరటాల శివ సినిమాల్లో సటిల్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఇలా ఏ డైరెక్టర్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ స్టయిల్ ని మహేస్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. ఈ విషయంలో ఆయనను పాదరసం అనచ్చు.

మెర్క్యూరీ ఏ వెజల్ లో పోస్తే ఆ వెజల్ పరిమాణాన్ని తీసుకుంటది. మీరు అలానే పాదరసంలాంటోళ్ళు. దర్శకుడు ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. దూకుడు చిత్రంలో టైటిల్ సాంగ్ లోని పాదరస ఒరవడి నరనరమే అనే వాక్యం మహేష్ కు సరిగ్గా సరిపోతుంది’ అంటూ హరీష్ శంకర్ మహేష్ ను ఆకాశానికి ఎత్తేశారు.

ఇది చాలదు అన్నట్లుగా మహేష్ ను తనకు అలవాటైన ఒక డిఫరెంట్ స్టైల్ లో చూపించాలని అనుకుంటున్నాను అంటూ తనకు మహేష్ తో సినిమాను చేయాలన్న కోరికను బయట పెట్టారు హరీష్ శంకర్. అయితే మహేష్ హరీష్ శంకర్ మాటలకు తన మార్క్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.

సుధీర్ బాబు, అదితి రావు హైదరి తాజాగా నటించిన చిత్రం ‘సమ్మోహనం’. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ప్రమోషన్స్ ను మొదలెట్టిన చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ ఈవెంటుకి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా వచ్చారు. అక్కడ జరిగిన సంఘటనే ఇది.

Share

Leave a Comment