సూపర్‌స్టార్ కి స్క్రీన్ జస్టిస్ చేయదు

ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే. మహేష్ అంటే తమకి ఇష్టం అని ఇప్పటికే పలు మార్లు అనేక ఇతర భాషా నటీమనులు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్స్ హీరోయిన్ గా పరిచయమై టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి చాందిని చౌదరి.

ప్రస్తుతం తెలుగు లో రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా చేస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మహేష్ అంటే తనకి ఇష్టం అని, ఆయనతో ‘బ్రహ్మోత్సవం’ లో కలిసి పని చేసిన విశేషాలు వివరించింది. చాందిని చౌదరి ని తన ఫ్యావరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా, మరో మాట లేకుండా ‘సూపర్‌స్టార్ మహేష్ బాబు’ అని చెప్పింది. ఆయన్ని తను ఎంతగానో అభిమానిస్తాను అని తెలిపింది. ఆయన తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అని, ఆయన చాలా డెడికేషన్ తో పని చేస్తారు అని తెలిపింది.

నేను చిన్నప్పటి నుంచి మహేష్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. మీరు మహేష్ గారిని మామూలుగా సినిమా స్క్రీన్ మీద చూసి చాలా అందంగా ఉంటారు అనుకుంటారు, మీరు ఆయన్ని పర్సనల్ గా చూస్తే ఆయన ఇంకెంత బావుంటారో తెలుస్తుంది. ఆయన ఆన్‌స్క్రీన్ 100% గుడ్ లుకింగ్ ఐతే ఆఫ్‌స్క్రీన్ 300% గుడ్ లుకింగ్.

స్క్రీన్ సరైన జస్టిస్ చేయదు. ఆయన అంతకమించి అందంగా ఉంటారు. అందమే కాకుండా ఆయన చాలా మంచి మనిషి, హి ఈజ్ ఎ జెంటెల్‌మెన్. చాలా స్వీట్. బ్రహ్మోత్సవం సెట్స్ కి వస్తూనే నేనెవరో తెలియకపోయినా పలకరించి చాలా బాగా మాట్లాడారు. సూపర్‌స్టార్ అని అని కొంచెం కూడా గర్వం ఉండదు.

చాలా డౌన్ టు ఎర్త్. చాలా సరదగా ఉంటారు. ఆయనతో పని చేసే అందరిని కంఫర్టబుల్ గా ఉండెలా చూస్తారు. నా సినిమా ట్రైలర్ కూడా చుసి నన్ను మెచ్చుకున్నారు. ఆయనకి అలా చెప్పే అవసరం లేదు కాని ఇంత ఎంకరేజ్ చేస్తారు. ఇది చాలు ఆయన గొప్పతనం తెలియడానికి. మా అమ్మ గారికి కూడా మహేష్ అంటే చాలా ఇష్టం. ఆయన్ని కలవడం తో ఆమె కూడా చాలా సంతోషించారు.

మహేష్ అందగాడే కాదు అంతకుమించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు అన్నది తనతో పనిచేసిన వారు చెప్పే మాట. అందుకే మహేష్ అందరిలో మోస్ట్ లవబుల్ హీరో అయ్యారు. పని పట్ల నూటికి రెండొందలు శాతం కమిట్మెంట్ ఉన్న హీరో.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ చిత్రం డెహ్రాడూన్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుంది. తాజాగా ఈ షెడ్యూల్ ముగిసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.

Share

Leave a Comment