టాలీవుడ్‌లో ఓన్లీ హీరో

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. ఏప్రిల్ 20న రిలీజైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతున్నది. 30 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది.

ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. నాన్ బాహుబలి చిత్రాల క్యాటగిరీలో 200 కోట్ల క్లబ్‌లో త్వరగా చేరిన సినిమా భరత్ అనే నేను. భరత్ అనే నేను తో సూపర్‌స్టార్ ఏ తెలుగు హీరో కు లేని కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో మీరు కూడా చూడండి.

ఈస్ట్ గోదావరిలో 6కోట్లకు పైగా షేర్ ఉన్న చిత్రాలు రెండు, కాకినాడలో కోటికి పైగా షేర్ ఉన్న చిత్రాలు రెండు, 50లక్షలకు పైగా షేర్ ఉన్న చిత్రాలు అమలాపురంలో రెండు, తెనాలి లో మూడు, కడపలో మూడు ఉన్న ఏకైక హీరో టాలీవుడ్లో సూపర్‌స్టార్ మహేష్‌ మాత్రమే. అమెరికాలో మిలియన్ డాలర్ల సినిమాలు 8, నైజాంలో రెండు 20కోట్ల షేర్ సినిమాలు, ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో ఏడు 1కోటి గ్రాసర్ లు ఉన్న ఒకే ఒక్కడు అయ్యాడు మహేష్‌ భరత్ అనే నేను తో.

1.5 మిలియన్ సినిమాలు 5, 2.5 మిలియన్ సినిమాలు 2, 500కె+ ప్రీమియర్స్ సినిమాలు 5 ఉన్న ఏకైక హీరో సూపర్ స్టార్ మాత్రమే. అసలు తెలుగు సినిమాకి మన బౌండరీల అవతల గుర్తింపు తెచ్చింది కూడా మహేషే.

ఇప్పటి వరకు తమిళనాడు లో బాహుబలి తప్పితే ఏ సినిమా సాధించని రికార్డ్ లెవల్ లో 4.5 కోట్ల గ్రాస్ మార్క్ ని తమిళనాడులో సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది భరత్ అనే నేను. చెన్నైలో ఈ సినిమా సెన్సేషన్ రన్ ని కొనసాగిస్తూ తెలుగు సినిమాల పరంగా ఏకంగా బాహుబలి 2 రికార్డ్ నే బ్రేక్ చేసి నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్ళింది.

తెలుగు చిత్రాలకు సంబంధించి చెన్నైలో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రాలలో ‘బాహుబలి 2’ ను వెనక్కి నెట్టి ‘భరత్ అనే నేను’ తో అల్టిమేట్ రికార్డ్ ను నెలకొల్పాడు సూపర్ స్టార్ మహేష్. కేరళలో ఏ తెలుగు చిత్రం కు సాధ్యం కాని రీతిలో పది రోజులకే 1 మిలియన్ రాబట్టి హయ్యస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది భరత్ అనే నేను.

భరత్ అనే నేను తో నాలుగవ 100 కోట్ల గ్రాసర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్. తెలుగు హీరోల్లో ఇదే హయ్యస్ట్. 50కోట్ల షేర్ సినిమాలు 5, 85కోట్ల షేర్ సినిమాలు 2 కలిగిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ మాత్రమే.

Share

Leave a Comment