ఉత్సవ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా

సూపర్‌స్టార్‌ మహేష్‌‌బాబు నటిస్తున్న తన 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రంలోని మొదటి పాటను శుక్రవారం (మార్చి 29న) విడుదల చేశారు. దీంతో పాటు మహర్షి షూటింగ్ ముగించే పనిలో బిజీగా ఉన్నారు మన మహేష్. ఇంత బిజీలోనూ నేడు హైదరాబాద్ లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటల్ లో ఒక ఈవింట్ కు హాయరయ్యారు ఆయన.

ఉత్సవ్ 2019 కల్చరల్ ఈవెంట్ ఇది. దీన్ని ఇన్‌కం టాక్స్ రిక్రియేషన్ క్లబ్ వారు నిర్వహిస్తున్నారు. ఇప్పటి లానే సింపుల్ గా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సూపర్‌స్టార్‌ మహేష్‌‌బాబు. ఆ ఈవెంట్ లోని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలు మీకోసం.

1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

మహేష్ ఎప్పటిలానే తన లుక్స్ తో అదరగొట్టాడు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటితో పాటు ఈ ఈవెంట్ లో మహేష్ కు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలు కూడా ఏంటో ఒకసారి చూసేయండి.

1) ఇన్‌కం టాక్స్ రిక్రియేషన్ క్లబ్ ఉత్సవ్ 2019 కల్చరల్ ఈవెంట్ లో మహేష్ బాబు ఎంట్రీ

2) ఇన్‌కం టాక్స్ రిక్రియేషన్ క్లబ్ ఉత్సవ్ 2019 కల్చరల్ ఈవెంట్ లో మహేష్ బాబు స్పీచ్

3) ఇన్‌కం టాక్స్ రిక్రియేషన్ క్లబ్ ఉత్సవ్ 2019 కల్చరల్ ఈవెంట్ లో మహేష్ బాబు మీద రాసిన ఒక కవిత

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహర్షి ఫస్ట్ సింగిల్ ఛోటీ ఛోటీ బాతే రిలీజ్ అయింది. ఈ పాటకు శ్రోతల నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఈ పాటకు 3.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కాలేజ్ నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య చోటుచేసుకున్న సన్నివేశాల ఆధారంగా వచ్చే ఈ సాంగ్‌ని మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే పై చిత్రీకరించారని ఈ వీడియోలోని స్టిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.

మహేష్‌కు ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో మహర్షి పై స్పెషల్ ఫోకస్ పెట్టారు చిత్ర యూనిట్. ఈ మూవీని మహేష్‌ కెరీర్‌లోనే మెమరబుల్‌ చిత్రంగా మలచాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది మహర్షి యూనిట్. ఈ ప్రేస్టిజియస్ మూవీలో కాలేజ్ స్టూడెంట్‌గా, ఎన్.ఆర్.ఐ.గా రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు మహేష్‌.

Share

Leave a Comment